ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కీలక అప్డేట్.. ఆధార్ నమోదు, బయోమెట్రిక్ కోసం స్పెషల్ డ్రైవ్
Aadhaar Update : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో విద్యార్థుల ఆధార్ కోసం పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సూచించింది.
తెలంగాణలోని అన్ని పాఠశాల విద్యార్థులకు 100 శాతం ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ కోసం పాఠశాల విద్యా శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 100 శాతం ఆధార్ నమోదు లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం పాఠశాల పిల్లల ఆధార్ నమోదు 94 శాతంగా ఉంది. మిగిలినది కూడా కంప్లీట్ చేయాలని భావిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని విద్యార్థులకు 100 శాతం ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్ సాధించడానికి పాఠశాల విద్యా శాఖ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సమన్వయంతో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్‌పై దృష్టి పెట్టింది
ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 100 శాతం విద్యార్థుల నమోదును నిర్ధారించాలి. సంబంధిత పాఠశాల UDISE+ లాగిన్ పోర్టల్‌లలో ప్రతిబింబించే పెండింగ్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేషన్ పూర్తి చేయాలి.
బయోమెట్రిక్ అప్డేట్స్ ప్రకారం విద్యార్థులు 5 సంవత్సరాలు నిండినప్పుడు, 15 సంవత్సరాల వయస్సు తర్వాత UIDAI నిబంధనలకు అనుగుణంగా ఐరిస్, వేలిముద్రలు, ఫోటోలను రిఫ్రెష్ చేయాలి.
ఆధార్ నమోదు, తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ కోసం తెలంగాణ అంతటా మూడు ఆధార్ మ్యాన్‌పవర్ ఏజెన్సీలను నియమించామని, ప్రతి ఏజెన్సీకి 11 జిల్లాలు కేటాయించినట్టుగా పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బయోమెట్రిక్ అప్డేట్స్ పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అవసరమైన సౌకర్యాల కోసం సంబంధిత పాఠశాల అధికారులను సంప్రదించాలి.
నీట్, జేఈఈ, ఐఐటీ, ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల వంటి పోటీ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించడానికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సకాలంలో పూర్తి చేయడం చాలా అవసరం. తల్లిదండ్రులందరూ తమ పిల్లల ఆధార్ అప్‌డేట్ స్టేటస్ ధృవీకరించాలని, భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి ఆధార్ వివరాలను వెంటనే అప్డేట్ చేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


