జూన్ నుంచి మహాలక్ష్మీ స్మార్ట్‌కార్డులు.. ఇక బస్సులో ఆధార్ చూపాల్సిన పని లేదు!
ఇకపై బస్సులో ఆధార్ చూపించాల్సిన అవసరం లేదు. అతి త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే స్మార్ట్‌కార్డుల పంపిణీ. ఈ కార్డులు ఎప్పటి నుంచి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే జూన్ నుంచి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్టీసీని ఆదేశించింది. తెలంగాణ బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు స్మార్ట్‌కార్డులు ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం. ఈ బడ్జెట్‌లో ఆర్టీసీకి నిధుల కేటాయింపుపై కూడా చర్చ జరిగింది. స్మార్ట్‌కార్డులను వీలైనంత త్వరగా మహిళలకు అందజేయాలని నిర్ణయించారు. మూడు రకాల స్మార్ట్‌కార్డులను భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చూపించారు.
అయితే మెుదట రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. జిల్లాకు ఒక మండలంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే.. పరిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. చిప్‌తో ఈ స్మార్ట్‌కార్డులను తయారీ చేస్తారు. సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల మహిళలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించడం వంటి దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ఉచిత ప్రయాణ ప్రయోజనాలను క్రమబద్ధీకరించడం దీని లక్ష్యం. ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధం చేసిన మూడు డిజైన్‌లతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు, సజావుగా టిక్కెట్ల జారీ, ధృవీకరణను సులభతరం చేస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇందులో ఏదో ఒక స్మార్ట్‌కార్డును ఫైనల్ చేసే అవకాశం ఉంది.
మార్చి 1, 2026 నుండి టీజీఎస్ఆర్టీసీ ఏసీ, లగ్జరీ బస్సులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రీమియం ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా చేయడానికి ఎక్స్‌ప్రెస్ బస్సు రేట్లతో ఛార్జీలను పోలుస్తారు. 'సమర్థవంతమైన సేవల కోసం త్వరలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నాం. ఇంకా, ఔటర్ రింగ్ రోడ్‌లో ఎలక్ట్రిక్ బస్సులు కాలుష్య నియంత్రణకు సహాయపడతాయి. PM e-డ్రైవ్ పథకం కింద 2,000 కొత్త బస్సులు వస్తున్నాయి.' అని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి చెప్పారు.
డిసెంబర్ 9, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సులలో జీరో ఫేర్ రైడ్‌లను అందించడం ద్వారా తెలంగాణలో మహిళల ప్రయాణం భారీగా పెరిగింది. లబ్ధిదారులు జీరో టికెట్ కోసం ఆధార్ కార్డును చూపించాలి. ప్రారంభమైనప్పటి నుండి ఈ పథకాన్ని మహిళలు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాడు. మొదటి నాలుగు నెలల్లోనే మహిళలకు రూ.1,177 కోట్లు ఆదా చేసింది. రోజువారీ ప్రయాణాలు కూడా పరిగాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


