ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాబ్ నోటిఫికేషన్ ప్రకటించింది. నిరుద్యోగులకు మంచి సరికొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(DCHS) కార్యాలయం, వివిధ జిల్లా సెకండరీ హెల్త్ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పూర్తిగా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. అర్హత, ఆసక్తి గల స్థానిక అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
పోస్టుల వివరాలు
జనరల్ డ్యూటీ అటెండెంట్ : 15 పోస్టులు
పోస్ట్‌మార్టం అసిస్టెంట్: 03 పోస్టులు
థియేటర్ అసిస్టెంట్: 01 పోస్టు
ప్లంబర్ : 01 పోస్టు
కావాల్సిన విద్యా అర్హతలు
వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి విద్యార్హతలు కలిగి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్.. ఈ మూడు రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం పదో తరగతి లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది.
ప్లంబర్‌కు పదో తరగతి పాస్ అవ్వడంతో పాటు గుర్తింపు పొందిన ఏవైనా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ITI) నుండి ప్లంబింగ్ లేదా ఫిట్టర్ లేదా మెకానిక్ ట్రేడులలో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి, జీతభత్యాలు
అభ్యర్థుల వయస్సు 01 జనవరి 2025 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో చట్టబద్ధమైన సడలింపులు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా థియేటర్ అసిస్టెంట్, పోస్ట్‌మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లకు రూ. 15,000 ఇస్తారు. అలాగే ప్లంబర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,500 జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలు నిర్వహించరు. అభ్యర్థులు తమ కనీస విద్యార్హతల్లో (పదో తరగతి / ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండే రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం
{{/usCountry}}ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూలు నిర్వహించరు. అభ్యర్థులు తమ కనీస విద్యార్హతల్లో (పదో తరగతి / ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కులు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండే రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.
దరఖాస్తు చేసుకునే విధానం
{{/usCountry}}అభ్యర్థులు అధికారిక అప్లికేషన్ ఫారమ్‌ను శ్రీకాకుళం జిల్లా అధికారిక వెబ్‌సైట్ (https://srikakulam.ap.gov.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూరించిన దరఖాస్తు ఫారమ్‌కు మీ విద్యార్హతలు, కుల ధృవీకరణ, నివాస ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి, నేరుగా కింది చిరునామాలో అందజేయాలి.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) కార్యాలయం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దరఖాస్తుకు చివరి తేదీ 2026 జులై 09 (ఆఫీస్ పనివేళల్లోగా సమర్పించాలి).
ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.
ఈ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.