తుపాను ధాటికి ఉప్పొంగుతున్న బాహుదా, నాగావళి, వంశధార.. భారీగా వరద నీరు
అర్నబ్ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రలో కనిపిస్తోంది. బాహుదా, నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఒడిశా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, అర్నాబ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లాలోని ప్రధాన నదులైన బాహుదా, నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చాయి. బాహుదా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు అత్యంత ప్రమాదకరమైన మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఒడిశాలోని బాఘలాటి డ్యామ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బాహుదా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇచ్ఛాపురం వద్ద దాదాపు 75,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి పెరగడంతో ఇచ్ఛాపురం వద్ద జాతీయ రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మండలంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడమే కాకుండా, మరో మూడు గ్రామాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.
పరిస్థితిని సమీక్షించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఇప్పటికే అన్ని సదుపాయాలతో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్య, రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
బాహుదా మాత్రమే కాకుండా భారీ వర్షాల వల్ల నాగావళి, వంశధార నదులు కూడా తీవ్రంగా ప్రవహిస్తున్నాయి. నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వద్ద, వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ రెండు నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం 167 గ్రామాలకు (నాగావళి తీరంలో 53, వంశధార తీరంలో 114) జిల్లా యంత్రాంగం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
నారాయణపురం ఆనకట్ట 1 లక్ష నుంచి 1.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉంది. గొట్టా బ్యారేజీకి 60,900 నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్న రహదారులను దాటే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. నదీ తీరాలకు లేదా వంతెనల వద్దకు వెళ్లి వరద నీటిని చూడటం, రికార్డ్ చేయడం లేదా రీల్స్ చేయడం లాంటివి చేయరాదు. అత్యవసర సహాయం కోసం స్థానిక అధికారులు లేదా కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలి. రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ, సురక్షిత ప్రాంతాలకు సహకరించాలని విజ్ఞప్తి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


