...
...
Next Story

AP Rains : ఏపీపై తీవ్రవాయుగుండం ఎఫెక్ట్ - ఇవాళ, రేపు భారీ వర్షాలు...! 5 జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటన

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా బలపడింది. విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

Published on: Sep 23, 2026, 05:12:11 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమమధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారిందని వాతావరణశాఖ వెల్లడించింది.

ఏపీకి భారీ వర్ష సూచన
ఏపీకి భారీ వర్ష సూచన

ఈ తీవ్రవాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 140 కిలోమీటర్లు, పూరీకి 210 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది మరింత ముందుకు సాగి ఇవాళ రాత్రి వేళకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలైన విశాఖపట్నం, గోపాల్‌పూర్ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాల హెచ్చరిక….

తీవ్రవాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు తీరప్రాంతాలతో పాటు అనేక జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాలతో పాటు తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తీవ్ర అప్రమత్తత పాటించాలని సూచించారు.

గాలి వేగం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నందున పాత భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల కింద లేదా సమీపంలో ప్రజలు ఎవరూ నిలబడకూడదని హెచ్చరించారు. సముద్రం తీవ్రంగా అలజడిగా మారినందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక యంత్రాంగాన్ని సంప్రదించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

స్కూళ్లకు సెలవు…

ఉత్తర కోస్తాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వాతావరణ శాఖ జారీ చేసిన తీవ్ర వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐదు తీరప్రాంత జిల్లాల్లో ఇవాళ (సెప్టెంబర్ 23) అన్ని విద్యాసంస్థలకు స్థానిక జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా కలెక్టర్లు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అత్యవసర పనులు ఉంటే తప్ప సుదూర ప్రయాణాలు చేయవద్దని, సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని స్పష్టం చేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున, ఉధృతంగా ప్రవహించే నీటి ప్రవాహాలను దాటేందుకు ఎవరూ ప్రయత్నించకూడదని హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks