...
...
Next Story

Tirumala Updates : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - శ్రీవారి సర్వదర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala Tirupati updates : వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 74 వేల మందికి పైగా దర్శించుకున్నారు.

Published on: Jun 13, 2026, 14:30:42 IST
Advertisement

Tirumala Tirupati updates : కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సప్తగిరులు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని గదులు, నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లు గోగర్భం డ్యాం సర్కిల్ సమీపంలోని ఆక్టోపస్ భవనం వెలుపల వరకు విస్తరించాయి.

తిరుమల
తిరుమల

టోకెన్లు లేని భక్తులకు ఉచిత సర్వదర్శనం (సర్వదర్శన భక్తులు) కోసం దాదాపు 24 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీని క్రమబద్ధీకరించడానికి అధికారులు ప్రస్తుతం భక్తులను బాట గంగమ్మ ఆలయం గుండా సర్వదర్శన క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.

గంటల తరబడి లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, తాగునీరు, పాలు, కాఫీలు అందజేస్తున్నారు. వసతి గదుల కోసం సీఆర్‌వో (CRO) కార్యాలయం వద్ద, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టల వద్ద భక్తులు భారీగా బారులు తీరారు.

నిన్నటి లెక్కలు ఇవే:

జూన్ 12, 2026 శుక్రవారం నాడు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, తలనీలాలు, లడ్డు విక్రయాలు మరియు హుండీ కానుకల వివరాలను టీటీడీవిడుదల చేసింది.

  • మొత్తం దర్శనాలు: నిన్న ఒక్కరోజే 74,636 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
  • శ్రీవారి హుండీ ఆదాయం: భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల ఆదాయం లభించింది.
  • లడ్డూల విక్రయం: తిరుమల ప్రసాదమైన శ్రీవారి లడ్డూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. శుక్రవారం నాడే రికార్డు స్థాయిలో 4.21 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు.
  • తలనీలాలు: స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు 43,084 మంది భక్తులు కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించారు.
  • అన్నప్రసాదం: వైకుంఠం క్యూ కాంప్లెక్స్, అన్నప్రసాద భవనాల్లో కలిపి నిన్న 3.18 లక్షల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
  • వైద్య సేవలు: తిరుమలలోని వివిధ అశ్విని ఆసుపత్రులు, ప్రథమ చికిత్స కేంద్రాలలో నిన్న ఒక్కరోజే 4,253 మంది భక్తులకు వైద్యులు ఉచితంగా వైద్య చికిత్స అందించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks