స్విట్జర్లాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు... పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను ముఖ్యమంత్రి కోరారు.
సహకారం కావాలి

ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కోరారు చంద్రబాబు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను... పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత్ అంబాసిడర్‌కు వివరించారు.
సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని, సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ చెప్పారు. ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. లిచ్టెన్ స్టైన్ అనే దేశంలో జరుగుతున్న ఏఐ ప్రగతికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి మృదుల్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.
ప్రకృతి సేద్యంలో మేమే టాప్
'నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయి. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరులకొరతతో ఉన్నాయి. భారత దేశం యువశక్తితో సిద్దంగా ఉంది. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుంది. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉంది. ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతాను. ప్రకృతి సేద్యంలో మేం దేశంలో టాప్‌లో ఉన్నాం.' అని చంద్రబాబు అన్నారు.
కంపెనీలు వచ్చేందుకు సహకరించండి : లోకేష్
ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్దంగా ఉందన్నారు. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నామని, 100 కేజీల బరువు మోసే డ్రొన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, వాటిని కనెక్ట్ చేస్తామన్నారు..బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామని కోరారు.
డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360
{{/usCountry}}ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్దంగా ఉందన్నారు. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నామని, 100 కేజీల బరువు మోసే డ్రొన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, వాటిని కనెక్ట్ చేస్తామన్నారు..బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామని కోరారు.
డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360
{{/usCountry}}అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్‌లతో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఈరోస్ జెన్ ఏఐ, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితర ఉత్పత్తుల తయారీని ఈరోస్ ప్రతినిధులు వివరించారు. డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రికి ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.