ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరించండి : జ్యూరిచ్‌లో భారత రాయబారితో చంద్రబాబు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం సీఎం చంద్రబాబు టీమ్ దావోస్ వెళ్లింది. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులతో చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
స్విట్జర్లాండ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు... పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను ముఖ్యమంత్రి కోరారు.

సహకారం కావాలి
ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కోరారు చంద్రబాబు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను... పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత్ అంబాసిడర్‌కు వివరించారు.
సీఎం చంద్రబాబు 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని, సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ చెప్పారు. ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. లిచ్టెన్ స్టైన్ అనే దేశంలో జరుగుతున్న ఏఐ ప్రగతికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి మృదుల్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.
ప్రకృతి సేద్యంలో మేమే టాప్
'నేడు ఏ దేశంలోకి వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయి. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరులకొరతతో ఉన్నాయి. భారత దేశం యువశక్తితో సిద్దంగా ఉంది. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుంది. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉంది. ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతాను. ప్రకృతి సేద్యంలో మేం దేశంలో టాప్‌లో ఉన్నాం.' అని చంద్రబాబు అన్నారు.
కంపెనీలు వచ్చేందుకు సహకరించండి : లోకేష్
ఈ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి సహకరించాలని భారత రాయబారిని కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలన్నారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సన్నద్దంగా ఉందన్నారు. యువతకు నైపుణ్యంలో శిక్షణను కల్పిస్తున్నామని, 100 కేజీల బరువు మోసే డ్రొన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని, వాటిని కనెక్ట్ చేస్తామన్నారు..బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామని కోరారు.
డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్, కో-ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో-ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్‌లతో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిల్మ్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ఈరోస్ జెన్ ఏఐ, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ తదితర ఉత్పత్తుల తయారీని ఈరోస్ ప్రతినిధులు వివరించారు. డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రికి ఈరోస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


