...
...
Next Story

డిప్యూటీ తహసీల్దార్ లవ్ మ్యారేజ్.. రాత్రికల్లా రాళ్లతో కొట్టి చంపిన అన్నలు

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో చెల్లె భర్తను కొట్టి చంపారు అన్నలు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Updated on: Feb 27, 2026, 12:07:48 IST
Advertisement

ఏపీలో పరువు హత్య కలకలం రేపుతోంది. చెల్లెలు కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఆమె భర్తను అన్నలు దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. మరీ కిరాతకంగా హతమార్చారు. ఉదయం పెళ్లిచేసుకోగా.. రాత్రివరకు చెల్లెలి భర్తను కొట్టి చంపేశారు. పూర్తి వివరాల్లోకి వెల్తే..

కోనసీమలో పరువు హత్య
కోనసీమలో పరువు హత్య

కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లి గ్రామంలో ఒక యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన బయటకు వచ్చింది. మృతుడు సూర్యప్రకాష్‌గా గుర్తించారు. అన్నవరం ఆలయంలో సంధ్య అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మహిళ కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిగింది. ఇదే పరువు హత్యకు కారణమైంది.

పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, మేడపాడు గ్రామానికి చెందిన సంధ్య ప్రస్తుతం రాయవరంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్నారు. ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు బట్టల వ్యాపారం చేస్తుంటారు. వీరిద్దరూ క్లాస్‌మేట్స్.. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు. దీంతో సంధ్య కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. తమ సోదరి ప్రేమ వివాహం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయంపై ఆమె సోదరులు కోపంగా ఉన్నారు.

అయినప్పటికీ ప్రేమికులు ఎలాగైనా పెళ్లిచేసుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసిన సంధ్య అన్నయ్యలు చంద్రపాల్, గిరిబాబు ఎలాగైనా సూర్యప్రకాష్‌ను చంపేయాలని అనుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks