Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ కారు నుజ్జు.. నుజ్జు.. న్యాయవాది మృతి
Road Accident : ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. న్యాయవాది ప్రయాణిస్తున్న కారుపై గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై భారీ ట్యాంకర్ బోల్తా పడటమే దీనికి కారణం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నివేదికల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది బి.శ్రీనివాసరావు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంతో వచ్చిన భారీ ట్యాంకర్ డివైడర్‌ను ఎక్కి, శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారుపై బోల్తా పడింది. దీంతో వాహనం పూర్తిగా నలిగిపోయింది... నుజ్జు.. నుజ్జు అయింది. ఐదు క్రేన్ల సహాయంతో అతికష్టం మీద ట్రక్కును పక్కకు తొలగించి మృతదేహాన్ని వెలికితీశారు.
హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం డివైడర్ ఢీకొని కారుపై పడింది. టోల్ గేట్ సిబ్బంది ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నుజ్జునుజ్జు అయిన కారు నుంచి మృతదేహాన్ని వెలికితీయడానికి ముందు, క్రేన్లు, జేసీబీ సహాయంతో రెండు గంటల పాటు ప్రయత్నాలు చేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు బాధితుడు న్యాయవాది బి. శ్రీనివాసరావు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ప్రమాద స్థలం వద్ద భారీగా జనాలు గుమిగూడటంతో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ ట్యాంకర్ బరువు కారణంగా కారు నుజ్జునుజ్జైపోయింది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఉంటే హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు అమరావతి నిర్మిస్తున్న తన కార్యాలయ పనులను పరిశీలించేందుకు వచ్చారని తెలుస్తోంది. కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం ప్రమాదం జరిగింది.
ఫ్లైయాష్ నింపుకొని వస్తున్న భారీ ట్యాంకర్ టోల్ ప్లాజా దగ్గర అదుపుతప్పి కారు మీద పడింది. డ్రైవర్ నియంత్రించలేకపోవడంతోనే ఈ ఘటన జరిగింది. న్యాయవాది శ్రీనివాసరావు స్టీరింగ్‌కు అతుక్కుపోయారు. శ్రీనివాసరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ట్యాంకర్ డ్రైవర్ తమిళనాడుకు చెందిన జేవియర్ ఆంటోని స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగినట్టుగా డ్రైవర్ చెబుతున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలం వద్ద భారీగా జనాలు గుమిగూడటంతో, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


