ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శిరివెళ్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. డీసీఎం వాహన డ్రైవర్ కారణంగా అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న ప్రైవేట్ బస్సు టైరు పేలి పోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను దాటి.. బస్సు అవతలి వైపు వెళ్లింది. అటు నుంచి వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు, కంటైనర్ ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు, ట్రక్కు క్లీనర్ గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.
రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు, ప్రైవేట్ బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. కాస్త ఆలస్యమైతే ప్రయాణికులు అంతా పెద్ద ప్రమాదంలో పడేవారు. బస్సు ప్రధాన ద్వారం, ఎమర్జెన్సీ విండో తెరవకపోవడంతో ప్రయాణీకులు తప్పించుకోలేకపోయారు.
అదృష్టవశాత్తూ ఆ ప్రాంతం గుండా వెళుతున్న ఒక డీసీఎం వాహన డ్రైవర్ మంటలను గమనించాడు. వెంటనే ఆగి ప్రయాణికులకు సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్రమత్తమై వెంటనే.. బస్సు అద్దాలను పగలగొట్టి 36 మంది ప్రయాణికులు తప్పించుకోవడానికి సహాయం చేశాడు. చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీల గుండా దూకారు.
పోలీస్ అధికారి మధుసూదన్ ప్రకారం.. నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దురదృష్టవశాత్తు బస్సు డ్రైవర్, ట్రక్ డ్రైవర్, క్లీనర్ వాహనాల లోపల చిక్కుకుని సజీవ దహనం అయ్యారు.
బస్సు, కంటైనర్ ట్రక్కును త్వరగా చుట్టుముట్టిన మంటలు రెండు వాహనాలను బూడిద చేశాయి. ప్రయాణికుల సామాను, వ్యక్తిగత వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చివరికి, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
{{/usCountry}}బస్సు, కంటైనర్ ట్రక్కును త్వరగా చుట్టుముట్టిన మంటలు రెండు వాహనాలను బూడిద చేశాయి. ప్రయాణికుల సామాను, వ్యక్తిగత వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చివరికి, దెబ్బతిన్న వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
{{/usCountry}}కేసు నమోదు చేశామని, ఏం జరిగిందో కచ్చితంగా తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని ఒక పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ప్రయాణికుల నుండి స్టేట్‌మెంట్‌లు సేకరిస్తున్నామన్నారు. డీసీఎం డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.