ఏపీ సర్కార్ మన మిత్ర 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా జనాలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు.. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆబా ఐడీ వివరాలతోపాటుగా ఆసుపత్రుల సమాచారం ఈజీగా పొందగలరు. డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలతో ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hai అని మెసేజ్ చేయాలి. పలు సర్వీసుల గురించి మీకు మెనూ డిస్‌ప్లే అవుతుంది. ఇందులో ప్రభుత్వాసుపత్రిలో ఓపీ అపాయింట్‌మెంట్ సర్వీసును ఎంచుకోవాలి. సంబంధిత జిల్లా, ఆసుపత్రి, విభాగం, తదితర ఆప్షన్స్ కనపడతాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. ఓటీపీ వస్తుంది. దీంతో లాగిన్ కావాలి.
ఇక మీ పేరు, పుట్టిన తేదీ, ఈ మెయిల్, అడ్రస్, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం పలు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు నెంబర్స్ నమోదు చేయాలి. ఆసుపత్రిలో ఆపాయింట్‌మెంట్ బుక్ అవుతుంది. దీని ఆధారంగా కేటాయించిన సమయంలో హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు.
ప్రస్తుత పద్ధతిలో రోగి లేదా వారి బంధువు ఆసుపత్రికి వెళ్లాలి. ఓపీ టోకెన్ కోసం క్యూలైన్‌లో ఉండాలి. కొన్నిసార్లు లేట్ అయితే టోకెన్ల్ దొరికే పరిస్థితి కూడా ఉండదు. ఇక డాక్టర్లను కలిసిన తర్వాత.. మందుల కోసం మరో లైన్‌లో నిల్చోవాలి. ఇవన్నీ చేసేముందు వెళ్లే రోజున స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. సరైన సమాచారం లేకుండ వెళ్లిన వెనుదిరిగి రావాల్సి వస్తుంది.
కానీ మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. అంతేకాదు మన మిత్ర వాట్సాప్‌లో ఆరోగ్య కార్డు సేవలు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించి.. సేవలు అగుపిస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్‌డేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ కోసం ఫిర్యాదు నమోదు చేసి.. కావాల్సిన పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్, ఆరోగ్య సేవల వివరాలు సులవుగా తెలుసుకోవచ్చు.
{{/usCountry}}కానీ మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. అంతేకాదు మన మిత్ర వాట్సాప్‌లో ఆరోగ్య కార్డు సేవలు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించి.. సేవలు అగుపిస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్‌డేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ కోసం ఫిర్యాదు నమోదు చేసి.. కావాల్సిన పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్, ఆరోగ్య సేవల వివరాలు సులవుగా తెలుసుకోవచ్చు.
{{/usCountry}}మీ ఆబా కార్డుకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నో యువర్ ఆబా ఆప్షన్ ఎంచుకోవాలి. మెుబైల్, ఆధార్ నెంబర్లు నమోదు చేయగానే.. ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసి.. లాగిన్ కావాలి. రోగి పేరు, వయసు ఆబా నెంబర్, అడ్రస్ కనిపిస్తాయి.