WhatsApp OP : ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్లు
WhatsAPP OP : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. దీంతో క్యూ లైన్‌లో జనాలు నిల్చోవలసిన అవసరం లేదు.
ఏపీ సర్కార్ మన మిత్ర 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా జనాలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చన్నమాట. అంతేకాదు.. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆబా ఐడీ వివరాలతోపాటుగా ఆసుపత్రుల సమాచారం ఈజీగా పొందగలరు. డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలతో ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.

మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో Hai అని మెసేజ్ చేయాలి. పలు సర్వీసుల గురించి మీకు మెనూ డిస్‌ప్లే అవుతుంది. ఇందులో ప్రభుత్వాసుపత్రిలో ఓపీ అపాయింట్‌మెంట్ సర్వీసును ఎంచుకోవాలి. సంబంధిత జిల్లా, ఆసుపత్రి, విభాగం, తదితర ఆప్షన్స్ కనపడతాయి. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. ఓటీపీ వస్తుంది. దీంతో లాగిన్ కావాలి.
ఇక మీ పేరు, పుట్టిన తేదీ, ఈ మెయిల్, అడ్రస్, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం పలు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు నెంబర్స్ నమోదు చేయాలి. ఆసుపత్రిలో ఆపాయింట్‌మెంట్ బుక్ అవుతుంది. దీని ఆధారంగా కేటాయించిన సమయంలో హాస్పిటల్ వెళ్లి వైద్య సేవలు పొందవచ్చు.
ప్రస్తుత పద్ధతిలో రోగి లేదా వారి బంధువు ఆసుపత్రికి వెళ్లాలి. ఓపీ టోకెన్ కోసం క్యూలైన్‌లో ఉండాలి. కొన్నిసార్లు లేట్ అయితే టోకెన్ల్ దొరికే పరిస్థితి కూడా ఉండదు. ఇక డాక్టర్లను కలిసిన తర్వాత.. మందుల కోసం మరో లైన్‌లో నిల్చోవాలి. ఇవన్నీ చేసేముందు వెళ్లే రోజున స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. సరైన సమాచారం లేకుండ వెళ్లిన వెనుదిరిగి రావాల్సి వస్తుంది.
కానీ మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. అంతేకాదు మన మిత్ర వాట్సాప్‌లో ఆరోగ్య కార్డు సేవలు అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించి.. సేవలు అగుపిస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్‌డేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ కోసం ఫిర్యాదు నమోదు చేసి.. కావాల్సిన పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్, ఆరోగ్య సేవల వివరాలు సులవుగా తెలుసుకోవచ్చు.
మీ ఆబా కార్డుకు సంబంధించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నో యువర్ ఆబా ఆప్షన్ ఎంచుకోవాలి. మెుబైల్, ఆధార్ నెంబర్లు నమోదు చేయగానే.. ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసి.. లాగిన్ కావాలి. రోగి పేరు, వయసు ఆబా నెంబర్, అడ్రస్ కనిపిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












