...
...
Next Story

Tirumala : హైదరాబాద్ భక్తుడి పెద్దమనసు - టీటీడీ ప్రాణదానం ట్రస్ట్‌కు భారీ విరాళం

టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన అన్నే శ్రీనివాసరావు అనే భక్తుడు రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు. తిరుపతిలో టీటీడీ ఈఓను కలిసి డీడీ సమర్పించారు.

Published on: Jun 22, 2026, 07:44:18 IST
Advertisement

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని రకరకాలుగా చాటుకుంటారు. స్వామి వారి సేవలతో పాటు సమాజంలో నిరుపేదలకు మేలు జరిగేలా టీటీడీ నిర్వహించే పలు ట్రస్ట్‌లకు విరాళాలు ఇస్తుంటారు. తాజాగా దరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు ఆదివారం రూ. 1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు.

ఈవోకు డీడీ అందజేత…

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాబాద్‌కు చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు ఈ విరాళాన్ని ఇచ్చారు. తిరుపతిలోని టీటీడీ ఈఓ క్యాంప్ కార్యాలయంలో రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూ. 1 కోటి విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను ఈఓకు స్వయంగా అందజేశారు.

తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేద రోగులకు ప్రాణదాన ట్రస్ట్ ద్వారా టీటీడీ ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తోంది. గుండె, మూత్రపిండాలు (కిడ్నీ), మెదడు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన జబ్బులతో బాధపడే పేద ప్రజలకు ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.

నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉన్నత లక్ష్యంతో టీటీడీ ఈ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమంది పేద రోగులకు ఈ ట్రస్ట్ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా పేరొందిన తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అధికారిక నిర్వహణ బాధ్యతలను టీటీడీ చూసుకుంటోంది. ఆలయానికి వచ్చే కానుకలు, విరాళాలను ఇటువంటి సామాజిక, సేవా కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తూ వినియోగిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks