ఏపీలో పొంగిపొర్లుతున్న వాగులు - శ్రీశైలం ఘాట్ రోడ్డులో రాకపోకలకు అంతరాయం..!
తుఫాన్ ప్రభావంతో శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ - శ్రీశైలం రోడ్డులో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో దోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డులో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పలు జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో నల్లమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో… శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

పెద్ద డోర్నాలలోని అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను శ్రీశైలం వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. జేసీబీలతో రాళ్లను తొలగిస్తున్నారు.లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
అచ్చంపేట - శ్రీశైలం ప్రధాన రహదారిపై చంద్రవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాజీపూర్ నుండి బ్రాహ్మణపల్లి మధ్య ఉన్న వంతెన పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీశైలం రహదారి సమీపంలోని చేమవాగు, చింతల సమీపంలోని వీర్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుచోంది. ఫలితంగా శ్రీశైలం రహదారిలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. అయితే శ్రీశైలం వచ్చే ప్రయాణికులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
మొంథా తుపాను కారణంగా నల్లమల అడవుల్లోని పాలంకలో తూర్పు కనుమల్లో జలపాతం పొంగిపోర్లుతుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న మట్టి మిద్దె కూలింది. భారీ వర్షాలతో మట్టిమిద్దె నానిపోవటంతో ఈ ఘటన జరిగింది.
పల్నాడు జిల్లా వినుకొండలో భారీ వర్షాలకు గోడకూలి వృద్ధురాలి మృతి చెందింది. 18వ వార్డు రామాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలైన రాములమ్మ ప్రాణాలు కోల్పోయింది.
భారీ వర్షాలకు ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ, జవహర్ నవోదయ విద్యాలయం నీట మునిగాయి. రెండు క్యాంపస్‌లలోకి భారీగా వరద నీరు చేరింది. ఆఫీస్ రూములు, తరగతి గదుల్లోకి నీరు చేరింది. పలు జిల్లాలకు చెందిన విద్యార్థులను ఇళ్లకు పంపించగా… ఇతర రాష్ట్రాల విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండిపోయారు.
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ చేశారు. కృష్ణా, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

