దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం(IIM Visakhapatnam) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐఎం విశాఖపట్నంలోని ఇంటర్ డిసిప్లినరీ డిసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్(IDeAL - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో ఈ నియామకాలు చేపడుతున్నారు.

రీసెర్చ్ అసోసియేట్ - డేటా సైన్స్ ఒక పోస్టు ఖాళీ ఉంది. నెలకు రూ.40,000 వేతనం అందజేస్తారు. ఇతర భత్యాలు వర్తించవు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అధిక వేతనాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఐఐఎం నిబంధనల ప్రకారం అభ్యర్థికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఒక సంవత్సరం కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో B.E / B.Tech లేదా M.Sc. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, డేటా సైన్స్ లేదా సంబంధిత విభాగాలలో M.Tech / MS / MCA లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అప్లైడ్/క్వాంటిటేటివ్ రీసెర్చ్, అనలిటిక్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో అత్యుత్తమ ప్రాజెక్టులు చేసిన ఫ్రెషర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ మోడలింగ్, C++, Python ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉండాలి. Machine Learning, Deep Learning, Cloud Computing పై అవగాహన ఉండాలి. ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు, హిందీ భాషల పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం.
దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఐఐఎం విశాఖపట్నం మెయిన్ క్యాంపస్, గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నంలో పని చేయాలి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాల దృష్ట్యా సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి రావచ్చు.
{{/usCountry}}దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఐఐఎం విశాఖపట్నం మెయిన్ క్యాంపస్, గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నంలో పని చేయాలి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాల దృష్ట్యా సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి రావచ్చు.
{{/usCountry}}అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష/టెక్నికల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందిస్తారు. ఐఐఎం విశాఖపట్నం అధికారిక వెబ్‌సైట్ www.iimv.ac.in/careers లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. హార్డ్ కాపీలను ఐఐఎం కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 అక్టోబర్ రాత్రి 11:59 గంటల వరకు ఉంటుంది.