ఐఐఎం విశాఖపట్నం జాబ్ నోటిఫికేషన్.. దరఖాస్తుకు అక్టోబర్ 30 లాస్ట్ డేట్
IIM Visakhapatnam Job : ఐఐఎం విశాఖపట్నం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు అక్టోబర్ 30వ తేదీలోపు చేసుకోవాలి.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం(IIM Visakhapatnam) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐఎం విశాఖపట్నంలోని ఇంటర్ డిసిప్లినరీ డిసిషన్ సైన్సెస్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్(IDeAL - సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో ఈ నియామకాలు చేపడుతున్నారు.

రీసెర్చ్ అసోసియేట్ - డేటా సైన్స్ ఒక పోస్టు ఖాళీ ఉంది. నెలకు రూ.40,000 వేతనం అందజేస్తారు. ఇతర భత్యాలు వర్తించవు. అత్యుత్తమ ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అధిక వేతనాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఐఐఎం నిబంధనల ప్రకారం అభ్యర్థికి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఒక సంవత్సరం కాలపరిమితితో కూడిన ఫిక్స్‌డ్ కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేస్తారు. అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది.
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి మ్యాథమెటిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగంలో B.E / B.Tech లేదా M.Sc. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆపరేషన్స్ రీసెర్చ్, డేటా సైన్స్ లేదా సంబంధిత విభాగాలలో M.Tech / MS / MCA లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
అప్లైడ్/క్వాంటిటేటివ్ రీసెర్చ్, అనలిటిక్స్, మ్యాథమెటికల్ మోడలింగ్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో అత్యుత్తమ ప్రాజెక్టులు చేసిన ఫ్రెషర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ మోడలింగ్, C++, Python ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు ఉండాలి. Machine Learning, Deep Learning, Cloud Computing పై అవగాహన ఉండాలి. ఆంగ్లంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు, హిందీ భాషల పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం.
దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఐఐఎం విశాఖపట్నం మెయిన్ క్యాంపస్, గంభీరం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నంలో పని చేయాలి. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 05:30 గంటల వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అవసరాల దృష్ట్యా సెలవు రోజుల్లోనూ పని చేయాల్సి రావచ్చు.
అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, రాత పరీక్ష/టెక్నికల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం అందిస్తారు. ఐఐఎం విశాఖపట్నం అధికారిక వెబ్‌సైట్ www.iimv.ac.in/careers లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. హార్డ్ కాపీలను ఐఐఎం కార్యాలయానికి పంపాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 అక్టోబర్ రాత్రి 11:59 గంటల వరకు ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


