...
...
Next Story

ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం - కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలు!

ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.

Published on: Oct 10, 2026, 09:43:55 IST
Advertisement

వాతారవణంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మళ్లీ ఏపీలో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ ముఖ్యమైన వివరాలను పేర్కొంది.

ఐఎండీ వెదర్ అప్డేట్స్
ఐఎండీ వెదర్ అప్డేట్స్

ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. అది తీవ్ర రూపం దాల్చే సూచనలున్నాయని అంచనా వేసింది. ఈ ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకోనుందని వెల్లడించింది.

ఈ అల్పపీడన వ్యవస్థ తదుపరి 3 నుంచి 4 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు వేగంగా కదిలే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది.

వాయుగుండంగా మారే అవకాశం…?

బంగాళాఖాతంలో ఏర్పడబోయే ఈ అల్పపీడన తీవ్రతపై విభిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇది బుధవారం నాటికి మరింత తీవ్రమై వాయుగుండం గా మారే అవకాశం ఉందని కొన్ని ప్రధాన వాతావరణ నమూనాలు (Weather Models) సూచిస్తున్నాయి. అయితే మరికొన్ని మోడల్స్ మాత్రం ఇది అల్పపీడనంగానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నాయి.

ఈ వాతావరణ వ్యవస్థ దిశ, తీవ్రతపై రాబోయే 24 నుంచి 48 గంటల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

మరోవైపు గడిచిన నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉక్కపోత సమస్యతో జనం ఇబ్బందిపడుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవటం, ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండటంతో…. చాలా ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా రాబోయే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిస్తే…. చాలా మార్పులు రావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks