Weather Forecast : అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ 19 నుండి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు
ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ 19 నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
IMD విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది సెప్టెంబర్ 18 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, సెప్టెంబర్ 19 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది క్రమంగా బలపడి, పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది.

దీనివల్ల వచ్చే వారం కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
'ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం (సెప్టెంబర్ 19) సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తదుపరి 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. వచ్చే వారం కొంతమేర వర్షాలు పడే అవకాశం ఉంది.' అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
బుధవారం నాడు కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లా రౌతులపూడిలో 68.6 మి.మీ, అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో 54 మి.మీ, కాకినాడ జిల్లా డి. పోలవరంలో 48.5 మి.మీ, కాకినాడ జిల్లా కోనపాపపేటలో 46.8 మి.మీ, విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 45.5 మి.మీ, అనకాపల్లిలో 44.5 మి.మీ, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో 43.7 మి.మీ వర్షపాతం నమోదైంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


