...
...
Next Story

బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం : ఏపీలో ఇవాళ, రేపు వర్షాలు - తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత

తీవ్రవాయుగుండం నేపథ్యంలో ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు.

Published on: Jan 10, 2026, 11:40:18 IST
Advertisement

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఉత్తర శ్రీలంక ట్రింకోమలీ - జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

ఇవాళ, రేపు వర్షాలు…

తీవ్రవాయుగుండం - ఏపీకి వర్ష సూచన
తీవ్రవాయుగుండం - ఏపీకి వర్ష సూచన

తాజాగా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

  • అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్న వివరాల ప్రకారం... ఉత్తర కోస్తాలో ఇవాళ పొడి వాతావరణం, పొగమంచు వాతావరణ పరిస్థితులుంటాయి.
  • దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.
  • రాయలసీమ ప్రాంతంలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు.
  • రాగల 4 రోజుల్లో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమ కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్:

తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఇవాళ పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే 2 రోజుల్లో అక్కడకక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండే సూచనలున్నాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe