AP Weather Update : ఏపీలో భిన్న వాతావరణం - అల్పపీడనం ప్రభావంతో 11 జిల్లాలకు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు మన్యంలో వడగాలులు వీయనున్నాయి.

Published on: May 13, 2026, 06:54:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో ఇవాళ (మే 13) విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొననున్నాయి. ఒకవైపు అల్పపీడన ప్రభావంతో వర్షాలు, మరోవైపు భానుడి భగభగలతో వడగాలులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వర్ష సూచన
వర్ష సూచన

11 జిల్లాలకు వర్ష సూచన:

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీని కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు. గుంటూరు, బాపట్ల, నెల్లూరు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చు.

వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సచించింది. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది.

కొన్ని ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత:

వర్ష సూచన ఉన్నప్పటికీ…. మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అల్లూరి జిల్లాలోని జికే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఎండ తీవ్రత దృష్ట్యా వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు రాకూడదని అధికారులు కోరుతున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వడగాలులు వంటి పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల ప్రజలు తమ ప్రయాణాలను…. పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More