...
...
Next Story

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలోని విశేష పర్వదినాలు, లిస్ట్ ఇదే

Tirumala May Festivals 2026 : శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మే నెలలో జరిగే విశేష పర్వదినాలను పేర్కొంది. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా…. ఈ ఉత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Published on: Apr 27, 2026, 11:34:43 IST
Advertisement

Tirumala May Festivals 2026 : శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. మే 1వ తేదీన కూర్మ జ‌యంతి, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌ ఉండనుంది. మే 12వ తేదీన హ‌నుమ‌జ్జ‌యంతి నిర్వహిస్తారు.

మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు:

  • మే 1న‌ కూర్మ జ‌యంతి, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.
  • మే 2న అన్న‌మాచార్య జ‌యంతి.
  • మే 3న ప‌రాశ‌ర భ‌ట్ట‌ర్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
  • మే 12న హ‌నుమ‌జ్జ‌యంతి.
  • మే 21న న‌మ్మ‌ళ్వార్ ఉత్స‌వారంభం.
  • మే 26న వ‌ర‌ద‌రాజ‌స్వామి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
  • మే 30న న‌మ్మ‌ళ్వార్ శాత్తుమొర‌.

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలోని విశేష పర్వదినాలు
తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - మే నెలలోని విశేష పర్వదినాలు

ప్రతి నెలా పౌర్ణమి నాడు తిరుమలలో జరిగే గరుడ వాహన సేవ మే నెలలో కూడా ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి మాడ వీధుల్లో మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

మే నెల వేసవి సెలవుల సమయం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దర్శనం టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్న వారు, దర్శన సమయానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎండల దృష్ట్యా టీటీడీ మాడ వీధుల్లో మరియు క్యూ లైన్లలో ప్రత్యేక షెడ్లు, చల్లని నీటి సౌకర్యం కల్పిస్తోంది. వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ మరింత తీవ్రంగా ఉంటుంది కాబట్టి…. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ అదనపు చర్యలు తీసుకుంటోంది. ఉత్సవాల కారణంగా కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసే అవకాశం ఉంది, కాబట్టి భక్తులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ ( https://news.tirumala.org/ ) ను గమనించాలని కోరుతున్నారు.

మే 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంత‌రం ఆలయంలో ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది.

  • మే 8న అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 8 గంట‌లకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆస్థానం.
  • మే 12న హ‌నుమ‌జ‌యంతి.
  • మే 16న అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
  • మే 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe