ఈ నగరంలో నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు!
విశాఖపట్నం నగరంలో పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్‌ను కఠినంగా అమలయ్యేలా చూస్తున్నారు. ఈ మేరకు పెట్రోల్ బంకులకు కూడా ఆదేశాలు ఇచ్చారు.
రోడ్డు భద్రతను పెంపొందించడానికి, మోటార్ సైకిల్ సంబంధిత ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి విశాఖపట్నం నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2026 నుండి నగరం అంతటా 'నో హెల్మెట్-నో పెట్రోల్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని పోలీసు అధికారులు సీరియస్‌గా చెప్పారు. బాధ్యతాయుతమైన రైడింగ్‌ను పెంపొందించడానికి, సిటీ రోడ్లపై మరణాలను తగ్గించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఈ ప్రచారం ప్రజలలో అవగాహన పెంచడం, ప్రాథమిక భద్రతా నిబంధనలను పాటించడాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ నొక్కి చెప్పారు. నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్ కేవలం ఒక నియంత్రణ కాదు, ఇది ప్రాణాలను రక్షించే చర్య అని పేర్కొన్నారు. ప్రతి రైడర్, వెనుక కూర్చున్నవారు(పిలియన్ రైడర్)ఇద్దరూ సేఫ్‌గా ఉంటారని తెలిపారు.
రైడర్లు ధరించే హెల్మెట్లు బీఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్ కలిగి ఉండాలని, జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఐఎస్ఐ మార్కును కలిగి ఉండాలని విశాఖ కమిషనర్ వెల్లడించారు. విశాఖపట్నం అంతటా అనేక పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించే, కొత్త నియమానికి మద్దతు ఇచ్చే సైన్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
'రైడర్లు మాత్రమే కాకుండా పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని మేం కోరుతున్నాం. వారి భద్రత ముఖ్యం.' అని సీపీ బాగ్చి అన్నారు.
విశాఖ నగర పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం, విశాఖపట్నంలో 2025లో 1,086 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. 2025 అంతటా ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద ఉల్లంఘించిన వారిని శిక్షించడానికి పలు ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించారు. ఈ ప్రయత్నాలు ఉన్నప్పటికీ హెల్మెట్ ధరించకపోవడం నిరంతర సమస్యగా మిగిలిపోయింది. దీని వలన కఠినమైన చర్యల అవసరమవుతున్నాయి.
మేం అన్ని పెట్రోల్ బంక్ యజమానులు, నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ పోయకూడదన్నారు. పెట్రోల్ బంక్ ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలితే, వారికి హెచ్చరికలు అందుతాయన్నారు. నిబంధనలను పాటించకపోతే పోలీసు శాఖ నుండి అధికారిక నోటీసులు వస్తాయని అన్నారు.
'క్రమం తప్పకుండా తనిఖీలు, జరిమానాలు, లైసెన్స్ సస్పెన్షన్లు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. హెల్మెట్ నిబంధనపై పౌరులకు అవగాహన కల్పించడానికి పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ ప్రదేశాలలో నగర పోలీసులు అవగాహన ప్రచారాలను ప్లాన్ చేస్తున్నారు.' అని ప్రవీణ్ కుమార్ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


