...
...
Next Story

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. మార్చి 9 నుంచి అగ్నివీర్‌‌వాయు రిక్రూట్‌మెంట్

Agniveervayu Recruitment Rally : నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. మార్చి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అగ్నివీర్‌ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.

Published on: Mar 7, 2026, 12:45:07 IST
Advertisement

భారత వైమానిక దళం అవివాహిత భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల కోసం ఇంటెక్ 02/26 కింద అగ్నివీర్ వాయు (సైన్స్ స్ట్రీమ్ కాకుండా) కోసం నియామక ర్యాలీని నిర్వహించనుంది. ఈ ర్యాలీ మార్చి 9 నుండి మార్చి 15 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని NH-16లో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద జరగనుంది. తర్వాత పరీక్షలు ఉంటాయి.

అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్
అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్

అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళంలో చేరాలనుకునే అర్హతగల అభ్యర్థులు నిర్ణీత తేదీలలో ర్యాలీలో పాల్గొనవచ్చు. అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లాలని, నియామక ప్రక్రియ కోసం భారత వైమానిక దళం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచించారు.

ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు, అలాగే ఇంగ్లిష్‌లో కూడా కనీస మార్కులు పొంది ఉండాలి.

అభ్యర్థులు జనవరి 1, 2006 నుంచి జూలై 1, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఐఏఎఫ్ నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగా ఎత్తు, బరువు, ఛాతీ విస్తీర్ణం, శారీరక సామర్థ్య ప్రమాణాలకు తప్పనిసరిగా సరిపోవాలి. అయితే పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా నిర్దేశించిన ప్రమాణాలను పాటించాలని గుర్తుంచుకోవాలి. ఈ నియామకాల కోసం దరఖాస్తును రూ.550 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన తర్వాత మాత్రమే.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయినట్టు.

అగ్నివీర్ వాయు నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ చేస్తారు. మెుదటి దశలో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు అకాడమిక్ పరిజ్ఞానం, లాజికల్ ఎబిలిటీ పరీక్షిస్తారు. రెండో దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌తోపాటుగా అడాప్టబులిటీ టెస్ట్ 1, అడాప్టబులిటీ టెస్ట్ 2 జరుగుతుంది. ఈ దశలో అభ్యర్థుల శారీరక దృఢత్వం, వాతావరణానికి సరిపోయే సామర్థ్యం చూస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe