రైల్వే టికెట్ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్.. రిఫండ్‌పై ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అప్డేట్ ఇది

Railway Ticket Cancellation Rule : ఇండియన్ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విషయంలో కీలక మార్పు చేసింది. ట్రైన్ బయలుదేరే సమయాన్ని బట్టి.. టికెట్ మెుత్తం రిఫండ్ చేయనుంది.

Published on: Mar 24, 2026, 14:19:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రైల్వే టిక్కెట్ రద్దు నిబంధనలలో ఒక ప్రధాన మార్పు చేసింది భారతీయ రైల్వే. ఇకపై రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు వరకు ఎవరైనా టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. వారికి ఒక్క పైసా కూడా వాపసు లభించదు. రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య ప్రయాణికులు తమ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధిస్తారు. అంతేకాకుండా రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటలలోపు టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే, ఎలాంటి డబ్బు రీఫండ్ చేయరు.

రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్

రైల్వే బోర్డులోని అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఒక ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 24 నుండి 72 గంటల మధ్య తన టిక్కెట్టును రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 25 శాతం కోత విధించి మిగిలినది రిఫండ్ చేస్తారు. అదే 72 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. మాగ్జిమమ్ రిఫండ్ ఉంటుంది. గతంలో 24 నుండి 28 గంటల మధ్య రద్దు చేసుకుంటే 25 శాతం రుసుము వర్తించేది.

ఒక ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు, లేదంటే రైలు బయలుదేరిన తర్వాత టికెట్ రద్దు చేసుకుంటే వారికి వాపసు (రీఫండ్) లభించదు.

రైలు బయలుదేరడానికి 8 నుండి 24 గంటల మధ్య మీరు మీ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఛార్జీలో 50 శాతం కోత విధించి.. మిగిలినది మీకు వాపసు చేస్తారు. ఈ కొత్త రూల్స్ దశలవారీగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య అమలు చేస్తారు.

ప్రస్తుతం రైలు బయలుదేరడానికి 48 గంటలలోపు మీరు మీ టిక్కెట్‌ను రద్దు చేసుకుంటే.. ఫస్ట్ ఏసీలో ప్రయాణికునికి రూ.240 ప్లస్ జీఎస్టీ తీసివేసి ఇస్తారు. సెకండ్ ఏసీలో ప్రతి టిక్కెట్‌కు రూ.200 ప్లస్ జీఎస్టీ, థర్డ్ ఏసీ, చైర్ కార్‌లో ప్రతి టిక్కెట్‌కు రూ.180 ప్లస్ జీఎస్టీ క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్‌లో ప్రతి టిక్కెట్‌కు రూ.120, థర్డ్ ఏసీ, సెకండ్ క్లాస్‌కు రూ.60 చొప్పున క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మారిన కొత్త రూల్స్‌తో క్యాన్సిలేషన్ ఛార్జీల్లో మార్పులు ఉంటాయి.

రైల్వే గత సంవత్సరం తమ రైలు సీటు బుకింగ్ విధానంలో కూడా అనేక మార్పులు చేసింది. ఉదాహరణకు, అక్టోబర్ 1, 2025 నుండి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా జనరల్-కోటా టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు, మొదటి 15 నిమిషాల బుకింగ్ విండోలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. ఈ రిజర్వేషన్ విధానం నుండి నిజమైన వినియోగదారులు మాత్రమే ప్రయోజనం పొందేలా చూడటమే దీని లక్ష్యం.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More