ఇంటర్‌సిటీ మొబిలిటీ బ్రాండ్ అయిన ఇంటర్‌సిటీ స్మార్ట్‌బస్ విజయవాడ-బెంగళూరు మార్గంలో ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యంపై దృష్టి సారించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సేవలను ప్రారంభించింది. విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(DCP - ట్రాఫిక్) షెరీన్ బేగం విజయవాడలో భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)-ఆధారిత ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా షెరీన్ బేగం మాట్లాడుతూ.. విజయవాడ-బెంగళూరు, బెంగళూరు-విజయవాడ కారిడార్‌లలో స్మార్ట్‌బస్ AQI సేవలను ప్రారంభించడం భారతదేశ రవాణా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు.
ముఖ్యంగా దూర ప్రయాణాల సమయంలో ప్రయాణికుల ఆరోగ్యాన్ని కాపాడటానికి బస్సుల లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడంపై ఈ చొరవ దృష్టి సారించిందని పేర్కొన్నారు. 'సుదూర ప్రయాణాల సమయంలో ప్రయాణికుల ఆరోగ్యం, సౌకర్యాన్ని పెంపొందించే లక్ష్యంతో AQI ఎనేబుల్డ్ ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ ప్రారంభించారు.' అని షెరీన్ చెప్పారు.
బస్సుల లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడం, ప్రయాణీకులకు మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. ఇంటర్‌సిటీ నిర్వహించిన అంతర్గత అధ్యయనాల ప్రకారం, బస్సు క్యాబిన్‌ల లోపల వాయు కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సిఫార్సు చేసిన పరిమితుల కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.
దీనిని పరిష్కరించడానికి కంపెనీ క్యాబిన్ గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి స్మార్ట్‌బస్ AQI సాంకేతికతను ప్రవేశపెట్టింది. విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులు స్మార్ట్‌బస్ AQI అని ట్యాగ్ చేసిన బస్సులను ఎంచుకోవడం ద్వారా IntrCity మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ ప్రత్యేకంగా తయారుచేసిన బస్సులను బుక్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ ఏక్యూఐ, PM2.5 రీడింగ్‌లు బస్సు లోపల స్క్రీన్‌లపై అలాగే ప్రయాణ సమయంలో మొబైల్ యాప్‌లో కనిపిస్తాయి.
ఇంటర్సిటీకి చెందిన మనీష్ రతి మాట్లాడుతూ.. బెంగళూరు వంటి సుదూర మార్గాలకు డిమాండ్ ఉన్నందున విజయవాడ కీలకమైన ఇంటర్‌సిటీ ట్రావెల్ హబ్‌గా అవతరించిందని అన్నారు. ప్రయాణికులు ప్రయాణాల సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేయడం ఏక్యూఐ సేవ లక్ష్యమని పేర్కొన్నారు.
{{/usCountry}}ఇంటర్సిటీకి చెందిన మనీష్ రతి మాట్లాడుతూ.. బెంగళూరు వంటి సుదూర మార్గాలకు డిమాండ్ ఉన్నందున విజయవాడ కీలకమైన ఇంటర్‌సిటీ ట్రావెల్ హబ్‌గా అవతరించిందని అన్నారు. ప్రయాణికులు ప్రయాణాల సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేయడం ఏక్యూఐ సేవ లక్ష్యమని పేర్కొన్నారు.
{{/usCountry}}