...
...
Next Story

పొగాకు రైతులకు రూ.50,000 వడ్డీ లేని రుణం.. క్వింటాల్‌‌పై రూ.1000 సాయం!

పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.50,000 వడ్డీ లేని రుణం అందించేందుకు నిర్ణయించింది.

Published on: Aug 10, 2026, 15:42:03 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు ప్రకటించింది. ప్రతి పొగాకు రైతుకు రూ.50,000 చొప్పున సున్నా వడ్డీతో రెండేళ్ల కాలపరిమితికి రుణం అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. దీనితో పాటు ప్రభుత్వం తరఫున క్వింటాల్‌ పొగాకుపై రూ.1,000 అదనపు సాయం అందజేస్తామని, పంట విక్రయించిన 9 రోజుల్లోనే డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం
పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం

గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో సోమవారం నాడు పంట కొనుగోళ్లు, మద్దతు ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామితో పాటు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, పొగాకు బోర్డు ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.

వచ్చే సీజన్‌లో పొగాకు ఉత్పత్తిని 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గ్రేడింగ్ పేరుతో వ్యాపారులు రైతులను మోసం చేయకుండా అడ్డుకునేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. నాణ్యత ఆధారంగానే సరైన ధర దక్కేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని చెప్పారు.

పొగాకు విక్రయించిన 9 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేస్తున్నాయని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గత వైకాపా పాలనలో పొగాకు మద్దతు ధరలు ఘోరంగా పడిపోయినా వైయస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జగన్ హయాంలో మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 11 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేశారని గుర్తుచేశారు. తెలుగుదేశం పాలనలోనే పొగాకు రైతులకు ఎల్లప్పుడూ న్యాయం జరిగిందని, ఈ వాస్తవాన్ని రైతులు గుర్తించాలని కోరారు. నాణ్యత సాకుతో వ్యాపారులు ధరలు తగ్గించి రైతులను నిలువుదోపిడీ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks