ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌.. ఎవరు అధికారంలో ఉన్నా ఏం చేయలేరు!

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎవరు అధికారంలో ఉన్నా ఏం పెట్టుబడిదారులను ఏం చేయలేరని వ్యాఖ్యానించారు.

Published on: Nov 12, 2026, 14:16:25 IST
By , Visakhapatnam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

విశాఖపట్నంలో 31వ సీఐఐ సమ్మిట్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వివిధ సంస్థల ఛైర్మన్‌లు, 58 దేశాల నుంచి 3,800 మంది ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

విశాఖ సీఐఐ సదస్సు ప్రారంభం
విశాఖ సీఐఐ సదస్సు ప్రారంభం

ఏపీలో అనుసరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కార్ల యూనిట్ ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కూడా కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించామన్నారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉందన్నారు. ఇదీ అనుమతులను వేగంగా మంజూరు చేయడంలో ఏపీ ట్రాక్ రికార్డ్ అని చెప్పుకొచ్చారు.

'బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. పూర్తి టెక్నాలజీ సాయంతో ఐకానిక్ భవనాలతో నగరాన్ని నిర్మాణం చేపడుతున్నాం. పారిశ్రామిక వేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని కోరుతున్నాను. ఏపీలో ఉన్న 6 ఆపరేషనల్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, హై స్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు కనెక్టివిటీతో అత్యుత్తమ లాజిస్టిక్స్ ప్రాంతంగా ఉంది. రివర్ లింకింగ్ ద్వారా సాగు, తాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాం. గోదావరి కుడి, ఎడమ కాలువల ద్వారా విశాఖకు, అమరావతికి నీరు ఇవ్వడంతో పాటు పొరుగు రాష్ట్రంలో ఉన్న కావేరీ నదీ కి నీరు తీసుకువెళ్లే అవకాశం ఉంది.' అని చంద్రబాబు అన్నారు.

గోదావరి కావేరీ లింక్ ద్వారా 5 రాష్ట్రాల దాహార్తి తీర్చే అవకాశం ఉందన్నారు చంద్రబాబు. విద్యుత్ గ్రిడ్ లాగే వాటర్ గ్రిడ్ కూడా ఉంటే ప్రజలకు లబ్ది కలుగుతుందన్నారు. ఏపీలో 25 సెక్టోరల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ క్యాపిటల్‌గా తయారు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ జన్ విశ్వాస్ అని పిలుపు ఇచ్చారన్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా అనుమతులు రియల్ టైమ్‌లో ఇస్తున్నామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా అందిచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ్టి నుంచే ఎస్క్రో ఖాతా పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఏపీ నుంచి ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే ఈ చట్టాన్ని దేశం కూడా ఆచరించే పరిస్థితి వస్తుందన్నారు. రాజకీయ వైరుధ్యాలకు పెట్టుబడి దారులు బలి కాకూడదనే ఈ చట్టం తీసుకువస్తున్నామన్నారు.

'12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్‌తో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. 303 ఎంఓయూల ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ సదస్సుతో కలిపి ఏపీ రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది.' అని చంద్రబాబు అన్నారు.

ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అవకాశాల గని అని పెట్టుబడిదారులు ఉన్నతమైన ఆలోచనలతో రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు. మీరు అత్యంత ఉన్నంతగా ఎదుగుతారన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయి భద్రత, భరోసా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ం

'ఆంధ్రప్రదేశ్ 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖ ద్వారంగా రాష్ట్రం పనిచేస్తోంది. ఇక్కడ మానవవనరులు, ఇన్నోవేషన్ ఆలోచనలు, ప్రతిభ కలిగిన యువతరానికి కొదవ లేదు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే, వారికి పూర్తిగా సహకరించేందుకు, వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు క్షేత్రస్థాయిలో వెనువెంటనే తమ కార్యకలాపాలు మొదలుపెట్టేలా చొరవ తీసుకోవాలని అధికారులకు పవన్ చెప్పారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తగిన విధంగా సహకరిస్తుందన్నారు. రాష్ట్ర గతిని మారేలా మీ ఆలోచనలు, భవిష్యత్తు పునాదులు ఉండాలన్నారు. కేవలం భారీ పెట్టుబడిదారులకే కాకుండా, చిన్నస్థాయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మేం అన్ని విధాలుగా తగిన సహకారం అందిస్తామన్నారు. అక్కడున్న వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More