IRCTC Tour : డిసెంబర్ 2న ఐఆర్‌సీటీసీ క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్.. 8 రోజులు

IRCTC Clouds Of Meghalaya and Assam Tour : డిసెంబర్‌లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నవారికి ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

Updated on: Nov 22, 2026, 17:52:56 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐఆర్‌సీటీసీ బడ్జేట్ ధరలో టూర్ ప్యాకేజీలను నడుపుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 2వ తేదీన Clouds Of Meghalaya And Assam టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 8 రోజులు, 7 రాత్రుల టూర్ ఇది. ఇందులో భాగంగా గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి, డాకికి వెళ్తారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఫ్లైట్‌లో వయా హైదరాబాద్ మీదుగా వెళ్తారు.

ఐఆర్‌సీటీసీ క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్ ప్యాకేజీ (Unsplash)
ఐఆర్‌సీటీసీ క్లౌడ్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అస్సాం టూర్ ప్యాకేజీ (Unsplash)

డే 1

డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నానికి విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. సాయంత్రానికి గౌహతి చేరుకుంటారు. మిమ్మల్ని పికప్ చేసుకుని షిల్లాంగ్‌కు (100 కి.మీ.) తీసుకువెళతారు. రాత్రి భోజనం మీ సొంత ఖర్చుతో ఉంటుంది. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం చేస్తారు. షిల్లాంగ్‌లో బస ఉంటుంది.

డే 2

షిల్లాంగ్‌లో హోటల్‌లో అల్పాహారం చేస్తారు. చిరపుంజి సందర్శన (60 కి.మీ.). ఎలిఫెంటా జలపాతం, నోహ్ కలికై జలపాతం, మావ్స్‌మై గుహలు, సెవెన్ సిస్టర్ జలపాతాలను సందర్శిస్తారు. షిల్లాంగ్‌కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం చేసి, షిల్లాంగ్‌లో బస చేస్తారు.

డే 3

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. డావ్కి సరస్సు సందర్శనకు(80 కి.మీ.) వెళ్తారు. తరువాత మావ్లిన్నాంగ్ (ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం) సందర్శిస్తారు. లివింగ్ రూట్ బ్రిడ్జ్‌కు వెళ్తారు. షిల్లాంగ్‌కు తిరిగి వస్తారు. రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 4

హోటల్‌లో అల్పాహారం చేసి షిల్లాంగ్‌లోని స్థానిక సందర్శనీయ ప్రదేశాలకు వెళ్తారు. డాన్ బాస్కో మ్యూజియం, వార్డ్స్ సరస్సు చూస్తారు. సాయంత్రం షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. షిల్లాంగ్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.

డే 5

హోటల్‌లో అల్పాహారం చేస్తారు. చెక్ అవుట్ చేసి ఉమియం సరస్సును సందర్శిస్తారు. కజిరంగకు(270 కి.మీ.) బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. కజిరంగలో రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

డే 6

కజిరంగలో ఉదయాన్నే సఫారీకి వెళ్లవచ్చు(మీ సొంత ఖర్చుతో). తర్వాత హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. గౌహతికి (200 కి.మీ.) వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. గౌహతిలో రాత్రి భోజనం, బస ఉంటుంది.

డే 7

గౌహతిలో హోటల్‌లో అల్పాహారం చేస్తారు. కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం బ్రహ్మపుత్ర నదీ విహారం (మీ సొంత ఖర్చుతో) ఉంటుంది. గౌహతిలో రాత్రి భోజనం, బస.

డే 8

హోటల్‌లో అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. విమానం ఎక్కడానికి గౌహతి విమానాశ్రయంలో దింపుతారు. సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

ఐఆర్‌సీటీసీ Clouds Of Meghalaya And Assam టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.75850, డబుల్ ఆక్యుపెన్సీ రూ.62150, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.58550, చైల్డ్ విత్ బెడ్ రూ.51350, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.45350, 2 నుంచి 4 ఏళ్లు ఉన్న పిల్లలకు వితౌట్ బెడ్ రూ.37600గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్‌సైట్ సందర్శించండి.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.