IRCTC Ooty Tour Package : హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ - ఐఆర్‌సీటీసీ 6 రోజుల ప్యాకేజీ! ఈనెలలోనే జర్నీ, ధరలివే

మంచు కురిసే గిరిశిఖరాలు, పచ్చని తేయాకు తోటలను ఆస్వాదించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ 'అల్టిమేట్ ఊటీ' పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి జర్నీ ఉంటుంది.

Published on: Nov 9, 2026, 13:18:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రకృతి అందాలకు నిలయమైన ఊటీ, కూనూర్ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. 'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' (ప్యాకేజీ కోడ్ - SHR094) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఊటీ (Image Source Pixel)
ఊటీ (Image Source Pixel)

6 రోజుల టూర్ షెడ్యూల్ ఇలా…

5 రాత్రులు, 6 రోజులు ఉంటే ఈ ప్యాకేజీ… సికింద్రాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ధరలోనే దక్షిణ భారతదేశపు అత్యంత సుందరమైన హిల్ స్టేషన్లలో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. ప్రస్తుతం నవంబర్ 17వ తేదీకి టికెట్లు ఉన్నాయి. ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.

  • తొలిరోజు మధ్యాహ్నం 14:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ - 20629) ద్వారా టూర్ ప్రారంభమవుతుంది. గుంటూరు, తెనాలి, నల్గొండ మీదుగా ప్రయాణికులు ఈ రైలులో ఎక్కే సౌకర్యం ఉంది.
  • మరుసటి రోజు ఉదయం 09:10 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో (రోడ్డు మార్గాన 90 కి.మీ) ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన అనంతరం, మధ్యాహ్నం వేళ ఊటీలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొటానికల్ గార్డెన్స్, అందమైన ఊటీ లేక్‌లను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలోని హోటల్‌లోనే బస ఉంటుంది.
  • హోటల్‌లో అల్పాహారం ముగించుకుని ఊటీలోనే ఎత్తైన దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, అలరించే పైకారా జలపాతాలను చూసేందుకు బయలుదేరుతారు. ఈ రోజంతా కొండ ప్రాంతపు ఆహ్లాదాన్ని ఆస్వాదించిన పిమ్మట రాత్రికి ఊటీలో బస చేస్తారు.
  • ఉదయాన్నే టిఫిన్ చేసి, సుందరమైన తేయాకు తోటలకు పేరుగాంచిన కూనూర్ సందర్శనకు వెళ్తారు. అక్కడి పర్యాటక ప్రదేశాలను తిలకించిన అనంతరం మధ్యాహ్నానికి మళ్లీ ఊటీకి తిరిగివచ్చి రాత్రి బస చేస్తారు.
  • హోటల్‌లో అల్పాహారం పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12:00 గంటలకు చెకౌట్ అవుతారు. అనంతరం వాహనంలో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 15:40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 20630) ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు.
  • ఉదయం 11:00 గంటలకు రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడంతో ఈ మధురమైన యాత్ర పూర్తవుతుంది.

ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 31,050గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16,360, సింగిల్ షేరింగ్ కు రూ. 14,630గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదింవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More