IRCTC Arunachalam Tour : హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ - లిస్టులో పాండిచేరి..! ధరలివే
IRCTC Hyderabad Arunachalam Tour Package : హైదరాబాద్ నుంచి అరుణాచలం, కాంచీపురం, పాండిచేరి వెళ్లేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
Hyderabad to Arunachalam Tour Package : తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేసేందుకు భావోద్వేగంతో కూడిన ఆధ్యాత్మిక ఆసక్తిని భక్తులు కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ టూరిజం… 'అరుణాచల మోక్ష యాత్ర' (ప్యాకేజీ కోడ్: SHR107) పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ ప్యాకేజీ ద్వారా అరుణాచల శివక్షేత్రం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికం, పర్యాటకం కలగలిసిన కాంచీపురంతో పాటు పాండిచేరి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. ప్రస్తుతం నవంబర్ 13వ తేదీన జర్నీ అందుబాటులో ఉంది. అయితే ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది. సికింద్రాబాద్ పరిధిలోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది.
5 రోజుల టూర్ షెడ్యూల్ :
- మొదటి రోజు : కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5:00 గంటలకు రైలు నంబరు 17653 (కాచిగూడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్) ద్వారా ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు : ఉదయం 11:05 గంటలకు పుదుచ్చేరి(పాండిచేరి) స్టేషన్ చేరుకుంటారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత ఆరోవిల్, శ్రీ అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ సందర్శిస్తారు. ఆ రాత్రి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
- మూడో రోజు : ఉదయం హోటల్లో టిఫిన్ ముగించుకుని తిరువణ్ణామలై (అరుణాచలం) వైపు (120 కి.మీ) బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ అయిన అనంతరం అరుణాచలేశ్వర ఆలయాన్ని, గిరిప్రదక్షిణను తమ వీలును బట్టి పూర్తి చేసుకోవచ్చు. రాత్రి తిరువణ్ణామలైలోనే బస చేస్తారు.
- నాలుగో రోజు : ఉదయం టిఫిన్ తర్వాత చెకౌట్ అయి కాంచీపురం (120 కి.మీ) వెళ్తారు. కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం అరక్కోణం స్టేషన్ (30 కి.మీ) చేరుకుని, సాయంత్రం 6:05 గంటలకు రైలు నంబరు 17651 ఎక్కి తిరుగు ప్రయాణమవుతారు.
- ఐదో రోజు (మంగళవారం) : ఉదయం 7:50 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ 3ఏసీలో ట్విన్ షేరింగ్ కు రూ. 16900, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13210గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.10030, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.7530గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 14,820, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11,125గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు, ఇతర వివరాల కోసం 8287932229 / 8287932228 / 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఆసక్తి గల టూరిస్టులు IRCTC అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రాబోయే నవంబర్ 13, 2026 ప్రయాణ తేదీకి సంబంధించి బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది వెబ్ సైట్ లో ఇతర టూర్ ప్యాకేజీల వివరాలను తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

