ప్రయాణికులకు అలర్ట్.... పాత టైమింగ్స్ తోనే కాచిగూడ - అశోకాపురం ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాకపోకలు

కాచిగూడ - అశోకాపురం(కర్ణాటక) డైలీ ఎక్స్‌ప్రెస్ రైలు సమయాల్లో మార్పు ఉందన్న ప్రతిపాదనను దక్షిణ మధ్య రైల్వే వెనక్కి తీసుకుంది. పాత వేళల ప్రకారమే రైళ్లు నడుస్తాయని స్పష్టం చేసింది.

Published on: Aug 27, 2026, 16:14:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. కాచిగూడ - అశోకాపురం - కాచిగూడ (రైలు నంబర్లు 12785 / 12786) డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను వేగవంతం చేయాలని భావించినప్పటికీ… మునుపటి ప్రతిపాదనను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. సాంకేతిక, నిర్వహణ పరమైన కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ రైలు మునుపటి సమయాల్లోనే యథావిధిగా నడుస్తుందని వెల్లడించింది.

కాచిగూడ-అశోకాపురం ఎక్స్‌ప్రెస్ -దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
కాచిగూడ-అశోకాపురం ఎక్స్‌ప్రెస్ -దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం

ట్రైన్ టైమింగ్స్ వివరాలు…

గతంలో ప్రతిపాదించిన సమయ మార్పులు అమలులోకి రావు. 2026 ఆగస్టు 25 నుంచి కాచిగూడ నుంచి, అలాగే 2026 ఆగస్టు 26 నుంచి అశోకాపురం నుంచి అమలు చేయాలని భావించిన కొత్త వేళల ప్రకటనను పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. ప్రయాణికులు పాత సమయాలనే గమనించాలని అధికారులు సూచించారు.

  • కాచిగూడ - అశోకాపురం ఎక్స్‌ప్రెస్ (Train No. 12785) : ఈ రైలు ప్రతిరోజూ సాయంత్రం 07:05 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:55 గంటలకు అశోకాపురం(కర్ణాటక) చేరుకుంటుంది.
  • అశోకాపురం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (Train No. 12786 ) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 02:55 గంటలకు అశోకాపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

కాచిగూడలో బయలుదేరిన తర్వాత ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు మార్గంలో ప్రయాణించి మైసూర్ సమీపంలోని అశోకాపురం చేరుకుంటుంది. అయితే మార్గమధ్యంలో ఉన్న అన్ని స్టేషన్లలోనూ రాకపోకలు, నిలుపుదల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More