దక్షిణ భారతదేశంలోని ప్రముఖమైన ఆలయాల సందర్శన వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని రన్ చేస్తోంది. ఆసక్తి ఉన్నవారు బడ్జెట్ ధరలోనే పుణ్యక్షేత్రాలు దర్శించుకుని రావొచ్చు. దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం పేరుతో ఈ టూర్ ఐఆర్‌సీటీసీ ఆపరేట్ చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు.

8 రాత్రులు, 9 రోజుల టూర్ ఇది. జులై 20వ తేదీన ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, గుడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్ దగ్గర రైలు ఎక్కవచ్చు. ఈ టూర్‌లో భాగంగా అరుణాచలం దర్శనం కూడా ఉంటుంది.
సందర్శించే ఆలయాలు
తిరువణ్ణామలై (అరుణాచలం): ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయ దర్శనం.
చిదంబరం: అద్భుతమైన నటరాజ స్వామి దేవాలయం.
తిరుచ్చి (తిరుచిరాపల్లి): శ్రీరంగనాథస్వామి ఆలయ సందర్శన.
తంజావూరు: చారిత్రక బృహదీశ్వర ఆలయం.
రామేశ్వరం: పవిత్రమైన శ్రీ రామనాథస్వామి జ్యోతిర్లింగ దర్శనం.
మధురై: మీనాక్షి అమ్మవారి ఆలయం.
కన్యాకుమారి: భగవతి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం.
ప్యాకేజీ ధరలు
జులై 20 నుంచి జులై 28 వరకు ప్రయాణం ముగుస్తుంది. ప్యాకేజీ ధరల వివరాలు ప్రయాణీకులు ఎంచుకునే క్లాస్‌ను బట్టి టికెట్ ధరలు ఉన్నాయి. పెద్దలకు ఎకానమీ(స్లీపర్ క్లాస్) రూ.15,600, పిల్లలకైతే రూ.14,600, అదే స్టాండర్డ్ (3 AC) పెద్దలకు రూ.23,100, పిల్లలకు రూ.21,900, కంఫర్ట్ (2 AC) పెద్దలకు రూ.29,900, పిల్లలకు రూ.28,100గా ఉంది.
ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్ల సేవలు ఉంటాయి. అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు పర్యటన మెుత్తం మీతో ఉంటారు. భక్తులు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకోవచ్చు. పూర్తి వివరాలు, బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ను సందర్శించండి.
{{/usCountry}}ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం (శాకాహారం మాత్రమే) ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఫ్రెండ్లీ టూర్ ఎస్కార్ట్ల సేవలు ఉంటాయి. అవసరమైన సహాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు పర్యటన మెుత్తం మీతో ఉంటారు. భక్తులు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకుని దక్షిణ భారతదేశ పుణ్యక్షేత్రాలను సులభంగా దర్శించుకోవచ్చు. పూర్తి వివరాలు, బుకింగ్స్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ irctctourism.com ను సందర్శించండి.
{{/usCountry}}