ఐఆర్‌సీటీసీ యమునా పుష్కరాలు స్పెషల్.. ఏపీ, తెలంగాణ నుంచి కాశీ, అయోధ్య టూర్ ప్యాకేజీ!
ఐఆర్‌సీటీసీ (IRCTC) ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ - యమునా పుష్కరాలు స్పెషల్' పేరుతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఈ యాత్ర సాగనుంది.
మీరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ఒకే ప్యాకేజీలో దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే, పవిత్ర క్షేత్రాల దర్శనంతో పాటు ఎంతో విశిష్టమైన 'యమునా పుష్కరాలు'లో పుణ్యస్నానం ఆచరించే సదుపాయాన్ని కూడా కల్పించారు.

టూర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ ప్రత్యేక టూర్ మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగుతుంది. ప్రయాణ తేదీ జూన్ 3వ తేదీన ఉంది. ఈ టూర్‌లో పూరి, కోణార్క్, బైద్యనాథ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ అవుతాయి.
బోర్డింగ్ స్టేషన్ల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ముఖ్యమైన స్టేషన్ల నుండి ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్సి, సామల్‌కోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.
మెుదటి రోజు
తెలుగు రాష్ట్రాలలోని నిర్ణీత బోర్డింగ్ స్టేషన్ల నుండి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు
ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలోనే మధ్యలో ఆగుతారు. నైట్ హోటల్‌లో స్టే చేస్తారు. ఆ తర్వాత పూరి జగన్నాథ ఆలయం దర్శనం ఉంటుంది. పూరిలోనే రాత్రి బస చేస్తారు.
మూడో రోజు
బ్రేక్ ఫాస్ట చేసిన తర్వాత బయల్దేరుతారు. కోణార్క్ సూర్యదేవాలయం సందర్శిస్తారు. తర్వాత జసిదిహ్‌కు తదుపరి ప్రయాణం కోసం రైలు ఎక్కడానికి మాలతీపత్‌పూర్ రైల్వే స్టేషన్‌కి వస్తారు.
నాలుగో రోజు
జార్ఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం 'బాబా బైద్యనాథ్ ధామ్' దర్శనం ఉంటుంది. తర్వాత రైల్వే స్టేషన్‌లో దింపుతారు. అక్కడ నుంచి బనారస్ బయల్దేరుతారు.
ఐదో రోజు
ఐదో రోజు బనారస్ చేరుకుంటారు. అక్కడ నుంచి సార్నాథ్ వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఆరో రోజు
అల్పాహారం తర్వాత, రోజంతా కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీని సందర్శించండి. విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాలు చూస్తారు. సాయంత్రం గంగా హారతిని వీక్షించండి. రాత్రి బస కాశీలోనే ఉంటుంది.
ఏడో రోజు
కాశీ నుండి అయోధ్యకు ప్రయాణం అవుతారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన భవ్య రామమందిరంలో బాలరాముడి దర్శనం చేసుకుంటారు. డిన్నర్ ముగించుకుని అయోధ్య రైల్వే స్టేషన్ వస్తారు.
ఎనిమిదో రోజు
జూన్ 10 వ తేదీన ప్రయాగ్ సంగం వస్తారు. త్రివేణి సంగమం (గంగ, యమున, సరస్వతి నదుల కలయిక) వద్ద పవిత్ర స్నానాలు చేస్తారు. యమునా పుష్కరాల ప్రత్యేక పుణ్యస్నానాలు చేస్తారు. స్థానిక ఆలయాల దర్శనం చేసుకుంటారు. అనంతరం, సికింద్రాబాద్‌కు తిరిగి ప్రయాణించడానికి ప్రయాగ్‌రాజ్ నుండి రైలు ఎక్కుతారు.
తొమ్మిది, పదో రోజు
తొమ్మిది, పదో రోజు తిరుగు ప్రయాణం కొనసాగుతుంది. రైలులోనే ప్రయాణికులకు భోజన వసతులు కల్పిస్తారు. రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. జూన్ 12న టూర్ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు
ఎకానమీ (Sleeper Class)రూ.16,000, పిల్లలకు రూ. 15,600గా ఉంది. స్టాండర్డ్ (3AC Class)రూ. 26,100, పిల్లలకైతే రూ.24,800, కంఫర్ట్ (2AC Class) రూ. 34,100 ఉండగా.. చిన్న పిల్లలకు రూ.32,500గా నిర్ణయించారు.
ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలనుకునే వారు ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లలోని ఐఆర్‌సీటీసీ టూరిజం కౌంటర్లను నేరుగా సంప్రదించి టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


