అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి…
అద్భుతమైన అండమాన్ అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ టూరిజం… విశాఖ నుంచి ఆరు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. నవంబర్ 20, 2025వ తేదీన జర్నీ ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
అండమాన్….. అద్భుతమైన దీవుల సముదాయం. అందాలను వర్ణించలేని ద్వీపాలు, తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, అటవీ అందాలు, కోరల్ ఐలాండ్స్ కు అండమాన్ చాలా ప్రసిద్ధి. ఇలా ఒకటి కాదు ఎన్నో అందాలను అస్వాదించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ప్యాకేజీ వివరాలు:
- ప్యాకేజీ పేరు - ఎల్టీసీ స్పెషల్ అండమాన్ ఎమరాల్డ్స్
- ట్రావెలింగ్ మోడ్ - ఫ్లైట్
- స్టేషన్ - విశాఖపట్నం విమానాశ్రయం
- క్లాస్ - కంఫర్ట్
- జర్నీ తేదీలు - 20 నవంబర్ 2025 నుంచి 25 నవంబర్ 2025
- టూర్ వ్యవధి : 05 రాత్రులు/06 రోజులు
- చూసే ప్రాంతాలు :పోర్ట్ బ్లెయిర్, రాస్-నార్త్ బే ఐలాండ్, హావ్‌లాక్ ఐలాండ్, నీల్ ఐలాండ్, పోర్ట్‌బ్లెయిర్
- ధరలు : సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 67,165, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 50,570, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 48,990
- సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ - 9281030748, 9281495847, 9550166168
- వెబ్ సైట్ - https://www.irctctourism.com/
ఈ ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం నుంచి ఉదయం 08:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకోరుతుంటారు టూరిస్టులు. హోటల్‌కు వెళ్లారు. హోటల్‌కి చెక్-ఇన్ చేసి...మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ విజిటింగ్ ఉంటుంది. తర్వాత సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు. రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత రాస్ ఐలాండ్, నార్త్ బే సందర్శిస్తారు. భోజనం తర్వాత సముద్రిక (నేవల్ మెరైన్ మ్యూజియం) వీక్షిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి హావ్‌లాక్ ద్వీపానికి విహారయాత్రకు వెళ్తారు. అక్కడ హోటల్ లో చెక్ ఇన్ చేసి సాయంత్రం రాధానగర్ బీచ్ కు వెళ్లారు. హావ్‌లాక్ ద్వీపంలోనే రాత్రి బస ఉంటుంది. ఇక నాల్గో రోజు హేవ్‌లాక్ ద్వీపం- నీల్ ఐలాండ్ ను సందర్శిస్తారు. ఐదో రోజు ఉదయాన్నే భరత్‌పూర్ బీచ్‌లో సూర్యోదయాన్ని ఆస్వాదించండి. బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరతారు. స్థానికంగా షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లో బస చేస్తారు.
చివరి రోజు హోటల్ నుంచి చెక్అవుట్ చేసి ఉదయం 07:25 గంటలకు విశాఖపట్నం వెళ్లే విమానాన్ని బోర్డింగ్ ఉంటుంది. ఉదయం 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

