తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 3 రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదీల‌కు సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది.

Published on: Dec 25, 2025, 20:01:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అనూహ్య ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 3 రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 3 రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయ‌బ‌డ‌వు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించికోవాల‌ని ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు టీటీడీ విజ్ఞ‌ప్తి చేసింది.

భారీగా భక్తుల రద్దీ:

వరుస సెలవులతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు కూడా రద్దీ పరిస్థితులు ఉన్నాయి.

మరోవైపు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో…. క్యూలైన్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తాత్కాలికంగా క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని నిలిపివేసిన టీటీడీ… రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లోకి అనుమతించనుంది.

గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో పాటు క్రిస్మస్ హాలీ డేస్ కూడా ఉన్నాయి. దీనికి తోడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది.

ఇక అలిపిరి వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో… అలిపిరి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More