టీటీడీ : జ‌న‌వ‌రి 2026లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి నెల‌లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది. షెడ్యూల్ చూసి స్వామివారి భక్తులు తిరుమలకు ప్లాన్ చేసుకోవచ్చు.

Published on: Dec 24, 2025, 19:16:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనవరిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఆలయాల్లో ఎలాంటి ఉత్సవాలు ఉన్నాయో తెలుసుకుని వస్తే బెటర్. తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే.. తిరుపతిలోనూ ఆలయాలను సందర్శించుకోవచ్చు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి నెల‌లో జరుగనున్న విశేష ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు చూద్దాం..

టీటీడీ
టీటీడీ
  • జ‌న‌వ‌రి 1న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
  • జ‌న‌వ‌రి 2, 23వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
  • జ‌న‌వ‌రి 3న పౌర్ణమి గ‌రుడ‌సేవ‌
  • జ‌న‌వ‌రి 5న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు రామ‌చంద్ర‌తీర్థ క‌ట్ట‌కు వేంచేపు.
  • జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం.
  • జ‌న‌వ‌రి 14న భోగి తేరు.
  • జ‌న‌వ‌రి 15న మ‌క‌ర సంక్రాంతి.
  • జ‌న‌వ‌రి 16న గోదా క‌ల్యాణం
  • జ‌న‌వ‌రి 17న క‌నుమ పండుగ సంద‌ర్భంగా పార్వేటి ఉత్సవం.
  • జ‌న‌వ‌రి 18 నుండి ఫిబ్రవ‌రి 10వ తేదీ వ‌ర‌కు అధ్యయనోత్సవాలు
  • జ‌న‌వ‌రి 20న శ్రవణా నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామివారి నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
  • జ‌న‌వ‌రి 25న ర‌థ‌స‌ప్తమి.
  • జ‌న‌వ‌రి 27 నుండి ఫిబ్రవ‌రి 1వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు.

వైకుంఠ ద్వార దర్శనాలు

మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ ఏర్పాట్ల చేసింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేశారు. రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేశారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి, జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించారు. భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం ఇచ్చారు. దాదాపు 24 లక్షల మంది భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిప్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించారు.

ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించారు. ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కలుగుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More