వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం : తెరపైకి విజయమ్మ అఫిడవిట్..! వైసీపీ నుంచి ప్రశ్నలు
Jagan-Sharmila asset dispute: వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. వైఎస్ విజయమ్మ అఫిడవిట్ బయటికి రావటంతో…. మరోసారి వారి కుటుంబంలోని విబేధాలు బయటికి వచ్చాయి.
వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా వైెఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపిణీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టుల్లో నడుస్తోంది. కట్ చేస్తే తాజాగా వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌తో కూడిన పత్రం బయటికి రావటం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. క్లారిఫికేషన్ పేరుతో ఈ అఫిడవిట్ రిలీజ్ అయింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు.

అఫిడవిట్ - కీలక అంశాలు…
ఆస్తుల విషయంలో జగన్…. తన మేనకోడలు, మేనల్లుడికి అన్యాయం చేశాడని ఈ అఫిడవిట్ లో వైఎస్ విజయమ్మ పేర్కొన్నట్లు ఉంది. జగన్… వారికి ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో జగన్, షర్మిల న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉండగా…సందర్భానుసారంగా వైెఎస్ షర్మిల సోదరుడు జగన్ ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు కూడా గుప్పించారు.
వైఎస్ ఉన్నంత వరకు ఆస్తుల విభజన ఎప్పుడూ జరగలేదని విజయమ్మ ప్రకటన చేయడంతో వివాదం తీవ్రమైంది. నలుగురు మనవరాళ్లకు అన్ని ఆస్తులను సమానంగా పంచాలనేది వైఎస్సార్ ఉద్దేశమని తాజాగా విడుదలైన అఫిడటవిట్ లో ప్రస్తావించారు.
అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ప్రతి ఆస్తి షర్మిలాకు చెందినదని… జగన్ కూడా తన వాటాను గుర్తించి ఒప్పందంపై సంతకం చేశారని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్, బెంగళూరులోని యలహంకలోని భూమితో సహా కీలక ఆస్తులు షర్మిళకు చెందినవి అయినప్పటికీ…. ఎంఓయూలో చేర్చలేదని విజయమ్మ పేర్కొన్నారు.
ఆస్తుల పంపకం జరగలేదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు…? ఈ విషయాలను మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే " అంటూ వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌లో చివర్లో పేర్కొన్నారు.
వైసీపీ ప్రశ్నలు…!
ఈ అఫిడవిట్ వ్యవహారంపై వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. గత మూడేళ్లుగా షర్మిళమ్మ, సునీతమ్మ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు. షర్మిళ హద్దులు దాటి మాట్లాడుతున్నారని…. కుటుంబ సమస్యలను ఇంట్లో పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా, ప్రత్యర్థుల పత్రికలకు ఎక్కించి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును రోడ్డున పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిళమ్మ, సునీతమ్మ ఫోన్లు చెక్ చేస్తే వాళ్ల కాల్స్ అన్నీ ఏబీఎన్ రాధాకృష్ణతో మాట్లాడినవే ఉంటాయని వ్యాఖ్యానించారు.
2009లో వైఎస్సార్ మరణానికి ముందు ఆస్తి పంపిణీ జరిగిందని…. ఆప్యాయతతో జగన్ తన సోదరికి తన వాటా కంటే ఎక్కువ ఇచ్చారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు.
జగన్ ను బహిరంగంగా టార్గెట్ చేసే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమని శివప్రసాద్ రెడ్డి అన్నారు. కుటుంబ వివాదాన్ని రాజకీయ ప్రత్యర్థుల వద్దకు తీసుకెళ్లారని…. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసిందని ఆయన పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

