ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

Jal Jeevan Mission 2.0 : జేజేఎం 2.0తో 2028 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.

Published on: Mar 24, 2026, 15:47:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేస్తామని వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2025 సెప్టెంబర్‌లోనే సమగ్ర విధానాన్ని ప్రకటించినట్టు గుర్తు చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా సీఆర్ పాటిల్‌ను సీఎం కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం సీఆర్ పాటిల్ మాట్లాడారు.

వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయంపై సంప్రదించారని, ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు.

'జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం. మరో 3 కోట్ల ఇళ్లకు సురక్షితమైన తాగు నీటిని అందించాల్సి ఉంది. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నా. జల్ జీవన్ మిషన్ ద్వారా వివిధ ప్రాంతాల్లో 9 కోట్ల మంది మహిళలకు దూరం నుంచి నీరు తెచ్చుకునే కష్టాలు తప్పుతాయి. జేజేఎం 2.0 ద్వారా ఏపీలో ప్రతీ ఇంటికి కుళాయి అనే లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాను.' అని కేంద్రమంత్రి పాటిల్ అన్నారు.

2047 వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు చేరటం ముఖ్యమని కేంద్రమంత్రి చెప్పారు. సాగు కోసం కూడా రైతులకు రెండు సార్లు నీరందితే వారు కూడా సంతోషంగా ఉంటారన్నారు. జేజేఎం 2.0పై త్వరలో ఏపీలో జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించుకుందామన్నారు. పీఎం జన్ మన్, పీఎం జన్ భాగీదారీ మిషన్‌లో భాగంగానూ సురక్షిత నీటిని మారుమూల ప్రాంతాలకు అందించేందుకు నిధులు వినియోగించుకోవాలని కోరారు.

ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో జేజేఎం 2.0పై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు. తాజా ఎంఓయూతో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థను బలోపేతం కానుంది. 2028 డిసెంబర్ నాటికి హర్ ఘర్ జల్ సాకారం చేయాలనేది లక్ష్యం. ఢిల్లీలో ఎంఓయూ కార్యక్రమానికి కేంద్ర జల్ శక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. అమరావతి నుంచి వర్చువల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More