ఇన్‌స్టామార్ట్, స్కిల్స్ యూనివర్సిటీ ఎంఓయూ.. 5వేల మందికి పైగా ఉద్యోగాలు!
క్విక్ కామర్స్ రంగంలో తెలంగాణ యువతకు మరింత ఉపాధి అవకాశాలు రానున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ 5 వేల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చే విధంగా తయారుచేయనుంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ ఫీల్డ్‌లో యువత కెరీర్‌లను నిర్మించుకోవడానికి, నైపుణ్య ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(YISU), క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి.

రెండింటి మధ్య సహకారం రాష్ట్రంలోని 5,000 మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా వారికి ఉపాధి లభించనుంది. స్కిల్స్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
ఇందులో భాగంగా ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్విక్ కామర్స్‌లో ఉద్యోగ సంబంధిత కార్యాచరణ, నిర్వాహక నైపుణ్యాలను పెంపొందించడానికి మూడు నెలల అభ్యాస కార్యక్రమాన్ని ప్రవేశపెడతాయి. ప్రత్యేకించి శిక్షణలో డార్క్ స్టోర్ లేదా రిటైల్‌వేర్ కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ఈ కార్యక్రమం క్లాస్ రూమ్‌లో బోధన మాత్రమే కాకుండా.. ఫీల్డ్ ఎక్స్‌పోజర్ కూడా ఉంటుంది. కోర్సు, ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేయడం వల్ల విద్యార్థులు స్టోర్ మేనేజర్ ట్రైనీలు వంటి పాత్రల్లోకి వేగంగా చేరుకుంటారు.
క్విక్ కామర్స్ రంగంలో కీలకమైన డార్క్ స్టోర్ ఆపరేషన్లు, సరఫరా గొలుసు నిర్వహణ, కస్టమర్ సర్వీస్, రిటైల్ లాజిస్టిక్స్‌లో ఉద్భవిస్తున్న కొత్త ధోరణుల మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత స్టోర్ మేనేజర్ ట్రెయినీ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి. 5 వేల మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చి.. వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తారు.
స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ ప్రకారం.. 'ఈ సహకారం సరఫరా గొలుసు, క్విక్ కామర్స్ కార్యకలాపాలలో రియల్ టైమ్‌లో యువతను సిద్ధం చేసే అభ్యాస మార్గాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది.' అని అన్నారు.
ఇన్‌స్టామార్ట్ పరిశ్రమ నైపుణ్యం, బోధనా మద్దతు, గెస్ట్ ఫ్యాకల్టీని అందిస్తుంది. అయితే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ద్వారా విద్యా పర్యవేక్షణ, పాఠ్యాంశాల ఆమోదాన్ని అందిస్తుంది. ఈ భాగస్వామ్యంలో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌లో ఇన్‌స్టామార్ట్ సపోర్ట్‌తో శిక్షణా ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కూడా ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


