గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు
పరాభవ నామ సంవత్సరంలో తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పేలా సంకల్పం చేద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభవ నామసంవత్సరం ప్రజలందరికీ మంచి చేయాలని ఆకాంక్షించారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పులుపు, తీపి, వగరు, చేదు, కారం లాంటి రుచులు ఉంటాయని చెప్పారు.

'తెలుగు వారి సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ఉగాదిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతీ ఒక్కరం వేడుకగా ఉగాది నిర్వహించుకుని పంచాంగ శ్రవణం చేస్తాం. ఈ ఏడాది 38 మందికి కళారత్న అవార్డులు, 122 మంది ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలుగు సంస్కృతి వినూత్నం, పండుగలు విభిన్నం, ప్రకృతిని ఆరాధన, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇవి ప్రతీకలు. సంక్రాంతి మొదలుకొని అన్ని పండుగలకు విశిష్టత, ప్రాముఖ్యాలు ఉన్నాయి.' అని చంద్రబాబు అన్నారు.
ఆరోగ్యకరమైన జీవన శైలిని మన పండుగలు ప్రతిబింబిస్తాయని, నేలను, ప్రకృతిని, నీటిని పూజిస్తామన్నారు చంద్రబాబు. మూడో సారి గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయన్నారు. నీటిని పరిరక్షించేలా నీటి భద్రత అనే విధానాన్ని తీసుకువచ్చామన్నారు చంద్రబాబు. తాగడానికి, సాగుకు, పరిశ్రమలకు, పర్యావరణం కోసం నీరు కావాలన్నారు.
'ప్రస్తుతం 65 శాతం మేర నీటి నిల్వలు మన రిజర్వాయర్లలో ఉన్నాయి. మే 15 తేదీనే సాగుకు నీరు విడుదల చేస్తాం.. నారు మళ్లు వేసుకోవాలని ముందే చెప్పిన ప్రభుత్వం మాది. మన పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉంది. వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటివే. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుంది.' అని చంద్రబాబు చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం ఇలా వేర్వేరు పరిస్థితులను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం వచ్చిందని చంద్రబాబు పేర్కొ్న్నారు. 30 ఏళ్లక్రితమే ఐటీ విప్లవాన్ని ఊహించి టెక్నాలజీని ప్రోత్సహించానని తెలిపారు.
ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లే హైదరాబాద్ నగరం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీగా మారిందన్నారు చంద్రబాబు. 'విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదు. విలువలు లేని చోట ఏమీ మిగలదు. ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని తెలుగువారు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా సంకల్పం.' అని చంద్రబాబు చెప్పారు.
2047 నాటికి అగ్రస్థాయి జాతిగా తెలుగు జాతి ఉండాలన్న సంకల్పం మనం అంతా తీసుకోవాలన్నారు చంద్రబాబు. సంజివనీ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ ముఖ్యమైన ముందడుగు వేశామని తెలిపారు. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే పరిస్థితి వస్తుందన్నారు.
'పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీతో మళ్లీ జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్దిక సహకారం అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు రూ.20 వేల చొప్పున ఇచ్చాం. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చాం. 56 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. అర్చకులకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం, ఇమామ్‌లు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం.' అని చంద్రబాబు చెప్పారు.
గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు అన్నారు. తద్వారా కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీతో నీళ్లు వెళ్తాయి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఇంకా రూ.5 వేల కోట్ల మేర నిధులు వ్యయం చేయాల్సి ఉందని చెప్పారు. 2047నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


