Godavari Pushkaralu : మహా కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!
Godavari Pushkaralu : మహా కుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ఇందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పనులు చేయాలన్నారు.
సచివాలయం 5వ భవనంలోని సమావేశ మందిరంలో దేవాదాయ శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన 2027 గోదావరి పుష్కరాలపై గురువారం మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా 5 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందుగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆయా జిల్లా కలెక్టర్లు, శాఖలు రూపొందించిన పీపీటీలు, మంత్రుల సలహాలు, సూచనలు తదితర అంశాలపై చర్చ నిర్వహించి నిర్ణయాలు తీసుకున్నారు. మహా కుంభమేలా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని మంత్రుల బృందం నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలకు ఈ సారి 10 కోట్లకు మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు.

2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలు 6 జిల్లాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 4516 మీటర్ల మేర 373 స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరిలో 102, పశ్చిమ గోదావరి 40, కోనసీమ 175, ఏలూరు 36, కాకినాడ 5, పోలవరం జిల్లాలో 11 మొత్తంగా 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పుష్కరాల ప్రధాన రోజుల్లో(తొలి, వీకెండ్, అమావాస్య) దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. పవిత్ర స్నానం రోజు 2.25 కోట్లు వస్తారని మంత్రులు భావిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పిండ ప్రదానం ఘాట్లు, శానిటేషన్ ప్రక్రియ, రోడ్లు, వాటర్ తదితర విషయాల్లో పక్కా ప్రణాళిక ఉండాలని నిర్ణయంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులు రెండు, మూడు రోజులు అక్కడే ఉండేలా టెంట్ సిటీలు, హోమ్ స్టేల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు పనులు, ఖర్చుల అంచనాలు సిద్ధం చేశామన్నారు.
మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు నిర్వహించే ఆరు జిల్లాల్లో కేవలం 3 జిల్లాలోనే 9.60 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాజమండ్రి, కొవ్వూరు ఘాట్లకు భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అంచనా ఉందన్నారు. తదుపరి పుష్కరాల సమీక్ష రాజమహేంద్రవరం కేంద్రంగా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భక్తులు పుష్కర ఘాట్‌ల వద్దకు చేరుకోవడానికి రోడ్లకు మరమత్తులు చేయడం, అవసరమైన చోట వెడల్పు చేయడం చేయాలన్నారు మంత్రి ఆనం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఆరు జిల్లాల్లోని జేసీలు నోడల్ అధికారులుగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. పుష్కర ఏర్పాట్ల వివరాలను ముఖ్యమంత్రితో సమావేశానికి ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో దైవదర్శనాలు చేసుకుంటారని, అందుకనే 391 ఆలయాల్లో మైనర్ రిపేర్లుతో పాటు 43 ఆలయాలను రెనోవేషన్ చేయనున్నామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను జయప్రదంగా నిర్వహించాలన్న దృక్పదంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణాలు, నగరాల బ్యూటిఫికేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పుష్కర ఘాట్లను హడావుడిగా తక్కువ సమయంలో చేయడం వల్ల వాటి నాణ్యత లోపిస్తుందని, కావున ఈసారి తగిన సమయం ఉన్నందున ముందుగానే ఘాట్‌ల మరమత్తులు, కొత్త నిర్మాణాలు చేయడతామని చెప్పారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూ నిర్మాణాలు,మరమత్తులు ఉంటాయన్నారు.
3000 కి.మీల రహదారులు నిర్మించాలంటే ఇప్పటి నుండే పనులు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి . గోదావరి పుష్కరాలకు చాలా ప్రాశస్త్యం ఉందని అత్యంత ఘనంగా నిర్వహణకు ఏర్పాటు చేస్తామన్నారు.
గోదావరి పుష్కరాల ముందస్తు ఏర్పాట్లకు బడ్జెట్ లో రూ. 60 కోట్లు కేటాయించామన్నారు మంత్రి కందుల దుర్గేష్. తూర్పు గోదావరిలో విజ్జేశ్వరం నుండి పశ్చిమ గోదావరిలోని సిద్ధాంతం వరకు ఉన్న రోడ్డును బాగు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో 4800 రూమ్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, భక్తుల వసతికి ఇబ్బంది కలగకుండా టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు దుర్గేష్. రద్దీ నియంత్రణకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలని, ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం సమీపంలోని బ్రిడ్జిలంక, పిచ్చుకలంకలో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. అంతేగాక పర్యాటక సర్క్యూట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


