...
...
Next Story

AP Municipal Elections : విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల, లిస్ట్ ఇదే

AP Municipal Elections : మున్సిపల్ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

Published on: Oct 17, 2026, 12:51:31 IST
Advertisement

AP Municipal Elections : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సమాయత్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున రేసులో నిలబడే అభ్యర్థుల తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం…. గెలుపే ప్రామాణికంగా ప్రజాదరణ పొందిన నాయకులకు ఈ జాబితాలో స్థానం కల్పిస్తూ ఆమోదం తెలిపారు.

పవన్ తో వంగవీటి రాధా
పవన్ తో వంగవీటి రాధా

ఈ తొలి విడత జాబితాలో రెండు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ముఖ్యమైన మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించారు.

కార్పొరేషన్ల మేయర్/ అభ్యర్థులు:

  1. ఏలూరు కార్పొరేషన్ : రెడ్డి అప్పలనాయుడు
  2. విజయవాడ కార్పొరేషన్: వంగవీటి రాధాకృష్ణ

మున్సిపాలిటీల అభ్యర్థుల వివరాలు:

  1. అమలాపురం : నల్లా శ్రీధర్
  2. చిలకలూరిపేట : తోట రాజరాజేశ్వరి
  3. గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు
  4. నరసాపురం: కొత్తపల్లి శైలజ
  5. నిడదవోలు: కల్లం జ్యోతి
  6. పెడన: మట్టా శివపావని
  7. పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
  8. పుత్తూరు: డి. ఏలుమలై
  9. సాలూరు: గొర్లె విజయకుమారి
  10. సామర్లకోట: పిట్టా జానకి రామారావు
  11. తెనాలి: తోటకూర వెంకట రమణారావు
  12. తిరువూరు: పి. మాధవి

మహిళలకు, స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ఈ తొలి జాబితాలో పెద్దపీట వేశామని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు సంబంధించి రెండవ జాబితాను కూడా విడుదల చేస్తామని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks