AP Local Body Elections : 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు... జనసేన పోటీ చేసే స్థానాల జాబితా విడుదల, లిస్ట్ ఇదే

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలను జనసేన ఖరారు చేసింది. పొత్తులో భాగంగా 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మేయర్లు, ఛైర్మన్ పదవులకు పోటీకి సిద్ధమైంది.

Published on: Oct 16, 2026, 20:41:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు జనసేన పార్టీ సమాయత్తమైంది. కూటమి పొత్తులో భాగంగా తమ పార్టీ పోటీ చేసే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల స్థానాలను అధికారికంగా ఖరారు చేసింది. ఈ మేరకు పోటీ చేయబోయే స్థానాల జాబితాను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది.

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం
స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం

మొత్తంగా 4 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు, 21 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల్లో ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. వీటితో పాటు ఆయా స్థానాల్లో పోటీ చేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అభ్యర్థులకు సంబంధించి 'బి-ఫారాలు' పంపిణీ చేసే ప్రక్రియను కూడా పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. ఈ మొత్తం ఎన్నికల సన్నాహక ప్రక్రియను, ప్రతి దశను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జనసేన పోటీ చేసే 4 మున్సిపల్ కార్పొరేషన్లు:

  1. శ్రీకాకుళం
  2. కాకినాడ
  3. ఏలూరు
  4. విజయవాడ

పోటీ చేసే 21 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలు:

  1. రాజాం
  2. పాలకొండ
  3. సాలూరు
  4. తుని
  5. గొల్లప్రోలు
  6. పిఠాపురం
  7. సామర్లకోట
  8. ముమ్మిడివరం
  9. అమలాపురం
  10. నిడదవోలు
  11. నరసాపురం
  12. భీమవరం
  13. తాడేపల్లిగూడెం
  14. తిరువూరు
  15. పెడన
  16. తెనాలి
  17. చిలకలూరిపేట
  18. దర్శి
  19. మడకశిర
  20. పుట్టపర్తి
  21. పుత్తూరు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More