...
...
Next Story

ఎన్నికల ఫలితాల వేళ విషాదం : నిన్న గుండెపోటుతో మృతి.... నేడు ఎంపీటీసీగా విజయం! గెలుపు వార్త వినకుండానే…

తూర్పుగోదావరి జిల్లా ధుమంతునిగూడెంలో కౌంటింగ్ ముందే జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య గుండెపోటుతో మరణించారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆమె 352 ఓట్లతో విజయం సాధించగా, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Published on: Nov 7, 2026, 14:14:55 IST
Advertisement

గెలుపు తలుపు తట్టిన వేళ ఆ ఇంట్లో సంతోషం ఉప్పొంగాలి. పార్టీ శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపించాలి. కానీ ఆ ఊరిలో మాత్రం నిశ్శబ్దం ఆవరించింది. ప్రజలకు సేవ చేయాలనే తపనతో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన ఒక యువ మహిళా నాయకురాలు ఫలితాలు వెలువడే సమయానికి అనంత లోకాలకు తరలిపోయారు. ప్రజామోదం లభించి మెజారిటీ సాధించినా….. ఆ విజయాన్ని కళ్లారా చూసుకోలేక ఆమె కన్నుమూయడం తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర శోకసంద్రం నింపింది.

దివ్య
దివ్య

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెం గ్రామానికి చెందిన గారపాటి దివ్య (28) స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, గ్రామాభివృద్ధికి శ్రమిస్తానని ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఆమె ఉత్సాహాన్ని, సేవా గుణాన్ని గుర్తించిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు.

అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఎన్నికల పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందే దివ్య హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. అప్పటివరకు తమ మధ్య చిరునవ్వుతో మెలిగిన యువ నేత హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

మరణంలోనూ విజయం..

ఇవాళ ఉదయం నుంచి జరగుతున్న ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో దివ్య ఘన విజయం సాధించినట్లు వెల్లడైంది. ప్రత్యర్థి అయిన అధికార వైసీపీ అభ్యర్థిపై ఏకంగా 352 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారు. అధికారులు ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ విజయం గ్రామంలో సంతోషాన్ని తీసుకురావడానికి బదులు మరింత శోకాన్ని మిగిల్చింది. గెలుపు వార్త తెలిసిన తర్వాత ధుమంతునిగూడెంలో ఆనందోత్సాహాల కంటే తీవ్ర విషాదమే నిండిపోయింది. ఎన్నికల ప్రచారంలో రాత్రింబవళ్లు తమ వెంట నడిచిన అభ్యర్థి, ఇప్పుడు తమ మధ్య లేరనే నిజాలాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎన్నికల్లో ప్రజాదరణ పొంది విజయం సాధించినా, ఆ గెలుపు సంబరాన్ని పంచుకోవడానికి దివ్య భౌతికంగా లేకపోవడం ధుమంతునిగూడెం వాసులను కన్నీటి పర్యంతం చేస్తోంది. ఒక మంచి నాయకురాలిని కోల్పోయామని గ్రామానికి చెందిన స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు పార్టీల నేతల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks