జేఎన్‌టీయూలో భారత్-జర్మనీ ఇంటిగ్రేటెడ్ బి.టెక్ ప్రోగ్రామ్ అడ్మిషన్స్ ఓపెన్.. ఇలా అప్లై చేయండి
విజయనగరం జేఎన్‌టీయూ జీవీలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోర్సులకు అడ్మిషన్లు మెుదలయ్యాయి. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివరాలు చూడాలి.
ఇంజనీరింగ్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలను కల్పించే లక్ష్యంతో విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ (JNTU-GV) ఒక కీలక ప్రకటన చేసింది. ప్రముఖ జర్మనీ విశ్వవిద్యాలయంతో కలిసి అందిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది.

జేఎన్‌టీయూ-గురజాడ (JNTU-GV) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ‘ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్’ (IIBMP) ప్రవేశాల ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది. జర్మనీలోని ప్రముఖ రాయిట్లింగెన్ విశ్వవిద్యాలయం పరిధిలోని నాలెడ్జ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ వినూత్న కోర్సును రూపొందించారు.
ఈ అంతర్జాతీయ విద్యా ఒప్పందం ప్రకారం.. విద్యార్థులు తమ విద్యాసంవత్సరాల కాలపరిమితిలో ఒక భాగాన్ని విజయనగరం జెఎన్‌టీయూ-జీవీ క్యాంపస్‌లో, మిగిలిన భాగాన్ని జర్మనీలోని రాయిట్లింగెన్ విశ్వవిద్యాలయంలో చదవాల్సి ఉంటుంది.
కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు జెఎన్‌టీయూ-జీవీ నుండి బ్యాచిలర్స్(B.Tech) డిగ్రీ లభిస్తుంది. అలాగే జర్మనీకి చెందిన రాయిట్లింగెన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ (M.Tech/MS) డిగ్రీని పొందుతారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, అంతర్జాతీయ పారిశ్రామిక అనుభవం, గ్లోబల్ మార్కెట్‌లో అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్ రంగంలో సరికొత్త సాంకేతికతను నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సు ఒక సువర్ణావకాశం. విద్యార్థులు జర్మనీలో నివసిస్తూ అక్కడి విద్యా విధానాన్ని నేరుగా అనుభవించే అవకాశం దక్కుతుంది. జర్మనీ పారిశ్రామిక రంగానికి అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, లైవ్ ప్రాజెక్ట్‌లపై పని చేసే వీలుంటుంది.
అంతర్జాతీయ డిగ్రీ ఉండటం వల్ల గ్లోబల్ కంపెనీలలో సాఫ్ట్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ విభాగాలలో త్వరగా ఉద్యోగాలు లభిస్తాయి.
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హత గల విద్యార్థులు జెఎన్‌టీయూ-గురజాడ (JNTU-GV) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు, ఫీజుల నిర్మాణం, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల బ్రోచర్‌ను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ ప్రతినిధులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


