రూ.25 కోట్ల ఆస్తి వస్తుందనుకున్నా.. సంచలన విషయాలు తెలిపిన సాధిక్ ఖాన్

ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ సంచలన విషయాలు చెప్పాడు. ఆస్తిపై ఆశ పడినట్టుగా ఒప్పుకున్నాడు.

Published on: Sep 11, 2026, 07:19:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ విచారణలో సంచలన విషయాలను బయటపెట్టాడు. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని తానే పక్కా పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు.

ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు
ఏఈ నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ కేసు

కోర్టు అనుమతితో సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారించారు. విచారణ ప్రారంభంలో తొలి రెండు రోజులు తనకు ఏమీ తెలియదని సాధిక్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు సాంకేతిక ఆధారాలతో పాటు అతనికి సైనైడ్ విక్రయించిన వ్యక్తుల నుంచి సేకరించిన సాక్ష్యాలను నిందితుడి ముందు ఉంచడంతో అతడు తప్పు ఒప్పుకోక తప్పలేదు.

నిందితుడి వాంగ్మూలంపోలీసు విచారణలో సాధిక్ ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జగదీశ్వరరెడ్డిని ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో మొదట ఓసారి కొబ్బరి నీళ్లలో విషపదార్థాన్ని కలిపి ఇచ్చాడు.అనారోగ్యంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా సుమారు 3 నుంచి 4 సార్లు విషాన్ని అందించాడు. దీంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోతాడని భావించాడు.

కాకినాడ నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా జగదీశ్వరరెడ్డి కొద్దిగా కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే సాధిక్ ఖాన్ మళ్లీ సైనైడ్ పంపించడంతో, దానిని ఉపయోగించిన మరుసటి రోజే జగదీశ్వరరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. జగదీశ్వరరెడ్డి మరణం తర్వాత ఆయన భార్య సౌజన్యను వివాహం చేసుకుంటే.. వారి కుటుంబానికి చెందిన దాదాపు రూ. 25 కోట్ల ఆస్తి తన వశమవుతుందని సాధిక్ ఆశపడ్డాడు.

అయితే సౌజన్య తండ్రి (ఏఈ నూకరాజు) దీనికి ఏమాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆస్తి మొత్తాన్ని మనవడు రియాన్ష్ కార్తికేయ పేరిట లేదా కుటుంబంలోని మరొకరి పేరిట రాస్తామని తెగేసి చెప్పారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన సాధిక్ "ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను, ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఊరుకోను" అంటూ నూకరాజు కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించి గొడవపడ్డాడు. అందరినీ చంపేస్తానని హెచ్చరించినట్లు ఒప్పుకున్నాడు సాధిక్.

దీంతో ఏఈ నూకరాజు ఫ్యామిలీ భయంతో రాజమండ్రి గోదావరి వారధి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారని తాను ఊహించలేదని విచారణలో తెలిపాడు. నిందితుడు సాధిక్ ఖాన్ ఉపయోగించిన విష పదార్థ నమూనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆత్మహత్యల వెనక ఉన్న బ్లాక్‌మెయిలింగ్, వేధింపులపై పోలీసులు పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More