ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవ్వాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 10 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయ ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
ఆర్‌డీఓ, డీఎస్పీ, ఆలయ ఈఓల పర్యవేక్షణలో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్, అగ్నిమాపక శాఖ సిబ్బంది షిఫ్టుల వారీగా రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటారు. వేడుకలన్నీ ఆగమ శాస్త్ర సాంప్రదాయాల ప్రకారం జరగాలని, ప్రోటోకాల్ ఏర్పాట్లను చిత్తూరు ఆర్డీఓ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే కె. మురళీ మోహన్ మాట్లాడుతూ భక్తుల రక్షణ కోసం 100 సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్ల వద్ద అంబులెన్సులు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని, ప్రమాదకర విద్యుత్ వైర్లను తనిఖీ చేసి అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్నారు. కాణిపాకం - చిత్తూరు మధ్య ప్రతి 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు నడపాలని, స్వామివారి వాహన సేవలు రాత్రి 7 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి లోపు ముగిసేలా చూడాలని సూచించారు.
చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం, సుప్రభాతం మంటపం, కోనేరు, బస్ స్టాండ్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రథోత్సవం, పుష్ప పల్లకి సేవలకు అదనపు పోలీసులను రంగంలోకి దించుతామని స్పష్టం చేశారు.
{{/usCountry}}చిత్తూరు ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం, సుప్రభాతం మంటపం, కోనేరు, బస్ స్టాండ్, కళ్యాణకట్ట తదితర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రథోత్సవం, పుష్ప పల్లకి సేవలకు అదనపు పోలీసులను రంగంలోకి దించుతామని స్పష్టం చేశారు.
{{/usCountry}}'24 గంటల పాటు నిఘా ఉంచేలా ఒక సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్ కెమెరాలు, ఇతర వ్యవస్థలతో పరిసర ప్రాంతాల్లో అనుక్షణం నిఘా కొనసాగుతుంది. భక్తులకు రక్షణగా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.' అని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ ఎం. మణినాయుడు తదితరులు పాల్గొన్నారు.