తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఈ కార్యక్రమం జరుగనుంది.

పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.
పలు సేవలు రద్దు…
కార్తీక వన భోజన ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.
ముందుగా వచ్చిన వారికే టోకెన్లు - టీటీడీ ఈవో
శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీలో టీటీడీ మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. గతంలో ఉన్న డిప్ విధానం కాకుండా ఆన్‌లైన్ లో ముందు వచ్చిన వారికే ముందే అనే పద్ధతిలో టోకెట్లు ఇస్తామన్నారు. వచ్చే ఫిబ్రవరి నుండి ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు పర్మినెంట్ షెల్టర్, క్యూ లైన్స్, స్టీల్ ఫూట్ ఒవర్ బ్రిడ్జిలు, టాయిలెట్స్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
{{/usCountry}}తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు పర్మినెంట్ షెల్టర్, క్యూ లైన్స్, స్టీల్ ఫూట్ ఒవర్ బ్రిడ్జిలు, టాయిలెట్స్ నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
{{/usCountry}}భక్తుల సూచనలు మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈవో ప్రకటించారు.