Sign in

రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్'లో కీలక మార్పు, ఫిబ్రవరి 3 నుంచే అమలు...!

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానాల్లో మార్పులు ఉంటాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన జారీ చేసింది.  హైదరాబాద్ – తాంబరం మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెండు నెలల పాటు చెన్నై బీచ్ స్టేషన్ వరకు మాత్రమే నడపనున్నారు.

Published on: Jan 29, 2026, 19:28:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు

గమ్యస్థానం మార్పు….

సాధారణంగా చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12760) ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకg చెన్నై బీచ్ వరకూ మాత్రమే గమ్యస్థానం ఉంటుంది. ఈ ట్రైన్ చెన్నై బీచ్ కు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.

మరోవైపు తాంబరం స్టేషన్ కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12759) ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు సాయంత్రం 6.20కు బయలుదేరుతుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More